Tollywood: అప్పుడెప్పుడో చిరంజీవితో.. మళ్లీ ఇప్పుడు.! కొత్త సినిమా మొదలెట్టేసిన 'గాడ్ ఫాదర్' డైరెక్టర్..
Tollywood: తమిళ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబో కన్‌ఫర్మ్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Tollywood: అప్పుడెప్పుడో చిరంజీవితో.. మళ్లీ ఇప్పుడు.! కొత్త సినిమా మొదలెట్టేసిన 'గాడ్ ఫాదర్' డైరెక్టర్..
Tollywood: దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వెలువడింది. టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించనున్న నూతన సినిమా అధికారికంగా కన్‌ఫర్మ్ అయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పట్ల కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ జోనర్‌లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే హీరో కార్తీ, విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే మోహన్ రాజా కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలలోనూ మంచి బజ్ ఏర్పడింది.
ఈ సినిమా కథాంశం, జోనర్‌కు సంబంధించి మేకర్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కేవలం మా,స్ యాక్షన్ ఎలిమెంట్స్‌కే పరిమితం కాకుండా, ఎంతో ఇన్‌స్పైరింగ్ అయిన హీరోయిజం, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఉండేలా దర్శకుడు దీనిని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఆస్వాదించే విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఈ భారీ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనుంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో ఎంతగానో ప్రత్యేకమని దర్శకుడు రాజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. కార్తీతో కలిసి పనిచేయడం తనకెంతో ఉత్సాహాన్ని ఇస్తోందని, ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హీరో కార్తీ 'సర్ధార్-2' చిత్ర ప్రమోషన్స్ పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కనుందని మేకర్స్ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.




