కరిష్మా కపూర్ ‘బ్రౌన్’.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
Karisma Kapoor: బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి కరిష్మా కపూర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొంత సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు.
కరిష్మా కపూర్ ‘బ్రౌన్’.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
Karisma Kapoor: బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి కరిష్మా కపూర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొంత సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రౌన్’ (Brown). సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' లో జూన్ 5వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
మునుపెన్నడూ చూడని డీ-గ్లామర్ రోల్
ఇటీవల విడుదలైన ఈ సిరీస్ అధికారిక ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో కరిష్మా కపూర్ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత నైరాశ్యంలో మునిగిపోయిన, మద్యానికి బానిసైన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ 'రీటా బ్రౌన్' పాత్రలో కనిపించనున్నారు. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కరిష్మా.. ఈ సిరీస్‌లో పూర్తిగా డీ-గ్లామరైజ్డ్ లుక్‌లో, సిగరెట్లు కాలుస్తూ, మాత్రలు మింగుతూ తన అంతర్గత మానసిక సమస్యలతో పోరాడే పాత్రను పోషించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక టీనేజర్ హత్య కేసును ఛేదించే క్రమంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అనేది ఈ కథాంశం.
అభినయ్ దేవ్ మార్క్ డార్క్ థ్రిల్లర్
‘ఢిల్లీ బెల్లీ’, ‘బ్లాక్‌మెయిల్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు అభినయ్ దేవ్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అభిక్ బారువా రాసిన ‘సిటీ ఆఫ్ డెత్’ అనే నవల ఆధారంగా కోల్‌కతా నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. క్రైమ్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా , సైకలాజికల్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సిరీస్‌ను అత్యంత నైపుణ్యంతో రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడిన ఏకైక భారతీయ వెబ్ సిరీస్‌గా ‘బ్రౌన్’ ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడం విశేషం.
సాలిడ్ కాస్టింగ్ అండ్ ప్రొడక్షన్
జీ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్‌లో కరిష్మా కపూర్‌తో పాటు సూర్య శర్మ, జిషూ సేన్‌గుప్తా, సోని రజ్దాన్ , సీనియర్ నటి హెలెన్ కీలక పాత్రల్లో నటించారు. జిషూ సేన్‌గుప్తా ఇందులో ఒక రహస్యమైన సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా పాత్రల మధ్య ఉండే భావోద్వేగాల తీవ్రత ఈ సిరీస్‌ను సాధారణ క్రైమ్ కథలకు భిన్నంగా నిలబెట్టనుందని చిత్ర బృందం పేర్కొంది. కరిష్మా కపూర్ కెరీర్‌లో ఈ వెబ్ సిరీస్ ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని విమర్శకులు భావిస్తున్నారు.




