Rukmini Vasanth: ఎన్టీఆర్ హీరోయిన్ హోటల్ వీడియో వైరల్
Rukmini Vasanth: 'కాంతార: చాప్టర్ 1' నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rukmini Vasanth: ఎన్టీఆర్ హీరోయిన్ హోటల్ వీడియో వైరల్
NTR Dragon heroine : ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే టక్కున వినిపించే పేరు.. రుక్మిణి వసంత్. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టేసుకున్న ఈ కన్నడ బ్యూటీ.. 'కాంతార: చాప్టర్ 1' లో కనకవతిగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న యువరాణి పాత్రలో అదరగొట్టేసింది. అటు యష్ 'టాక్సిక్', ఇటు ఎన్టీఆర్ 'డ్రాగన్' లాంటి ప్రెస్టీజియస్ సినిమాలతో మోస్ట్ బిజీగా ఉన్న ఈ అందాల తారకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఒక హోటల్ రూమ్‌లో రుక్మిణి చేసిన పనే ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలు ఆ వీడియోలో ఏముంది?
సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్లతో నిరంతరం బిజీగా ఉండే రుక్మిణి వసంత్.. తాజాగా తన స్నేహితురాలితో కలిసి ఒక హోటల్ రూమ్‌లో చిల్ అవుతూ కనిపించారు. అయితే, ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్లే క్రమంలో రుక్మిణికి ఒక వింత సమస్య ఎదురైంది. షాపింగ్ ఎక్కువైందో ఏమో కానీ.. తాను తెచ్చుకున్న దుస్తులన్నింటినీ సూట్‌కేస్‌లో సర్దేసరికి లగేజ్ గరిష్ట స్థాయికి చేరిపోయింది. దుస్తులన్నీ లోపల పెట్టేసినా.. సూట్‌కేస్ జిప్ మాత్రం అస్సలు పట్టలేదు. దీంతో ఆ జిప్ లాక్ చేయడానికి మన కాంతార బ్యూటీ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!
పొట్టి దుస్తుల్లో ఉన్న రుక్మిణి.. ఆ సూట్‌కేస్ జిప్ వేయడానికి తన శక్తి అంతా ఉపయోగించి కష్టపడ్డారు. ఎలాగోలా మొత్తానికి కష్టపడి ఆ జిప్‌ను లాక్ చేసేశారు. పని పూర్తయిన వెంటనే.. ఏదో కొండను జయించినంత ఆనందంతో నేను సాధించాను.. అంటూ గట్టిగా అరుస్తూ ఆనందంతో గెంతులేశారు. పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు ఈ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్‌ను తన కెమెరాలో బంధించగా.. అది కాస్తా ఇంటర్నెట్‌లో లీక్ అయి వైరల్‌గా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్ అయిపోయింది. వెండితెరపై ఎంతో పద్ధతిగా, రాయల్ లుక్‌లో కనిపించే రుక్మిణి.. రియల్ లైఫ్‌లో ఇంత అల్లరి పిల్లనా అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.మరోవైపు ఆ వీడియోలో షార్ట్ డ్రెస్‌లో ఉన్న రుక్మిణి వసంత్ క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అక్కడ సూట్‌కేస్ గండం గట్టెక్కిందో లేదో కానీ.. రుక్మిణి గ్లామర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటూ నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. లగేజ్ ప్యాకింగ్ కష్టాలు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా తప్పవని ఈ వీడియో నిరూపిస్తోందని మరికొందరు నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా రుక్మిణి వసంత్ ఏం చేసినా ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోతోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోల కన్ను ఈ బ్యూటీపైనే ఉంది. త్వరలోనే రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో రుక్మిణి రేంజ్ ఎక్కడికో వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Rukmini Vasanth Unseen 🫰🏻 #Rukmini #RukminiVasanth https://t.co/B80txUu8Ez
— Revanth (@Revanthdhfm__) May 21, 2026




