Divorces: విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరోయిన్ అతనితో ఉండటం నావల్ల కాదంటూ

Divorces: కన్నడ స్టార్ నటి, ఫిల్మ్‌ఫేర్ అవార్డు గ్రహీత శుభ పూంజా తన భర్త సుమంత్ బిల్లావా నుండి అధికారికంగా విడిపోయారు.

Naresh.k
Published on: 7 Jun 2026 9:57 AM IST
Divorces
X

Divorces: విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరోయిన్ అతనితో ఉండటం నావల్ల కాదంటూ

Actress Shubha Poonja: వెండితెరపై ఎంత వెలిగినా, నిజ జీవితంలో మాత్రం కొందరి బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్‌లా మారిపోయాయి. చిన్న చిన్న మనస్పర్థలకే చెయ్యి వదిలేయడం, ఆ తర్వాత కొందరు రెండో పెళ్లి వైపు అడుగులు వేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి మరువక ముందే.. తాజాగా మరో ప్రముఖ నటి తన భర్తకు లీగల్‌గా గుడ్ బై చెప్పేసింది.

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శుభ పూంజా తన భర్త సుమంత్ బిల్లావా నుండి అధికారికంగా విడిపోయింది. శుభ పూంజా, సుమంత్ బిల్లావాలది లవ్ మ్యారేజ్. కొంతకాలం పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట, 2022లో ఇరువైపులా ఉన్న పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట మధ్య, రానురాను తీవ్ర మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.






ఒకే ఇంట్లో కలిసి ఉండలేనంతగా విభేదాలు రావడంతో, ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. పెళ్లైన కేవలం రెండేళ్లకే ఈ బంధం కోర్టు మెట్లు ఎక్కడం అందరినీ కలచివేస్తోంది. శుభ పూంజా కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 2008లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘మొగ్గినా మనసు’ సినిమాలో ఆమె నటనకు గానూ విమర్శకుల నుండి భారీగా ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గానూ ఆమెకు ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక 'ఫిల్మ్‌ఫేర్' అవార్డు కూడా లభించింది. ఎంతో చక్కని కెరీర్, క్రేజ్ ఉన్న ఈ నటి.. పెళ్లైన కొద్ది రోజులకే వైవాహిక జీవితంలో విఫలమై, ఇలా విడాకులు తీసుకోవడం కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి, ఆవేదనకు గురిచేస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story