‘నాకు కుకీస్ కావాలన్నా’ అని అడిగిన ఫ్యాన్.. నిజంగానే బేక్ చేసి పంపిన ఎన్టీఆర్!

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెర పైనే కాదు, నిజజీవితంలోనూ తనకున్న పెద్ద మనసును చాటుకున్నారు.

Srinivas Rao
Published on: 7 Jun 2026 4:06 PM IST
Jr NTR
X

‘నాకు కుకీస్ కావాలన్నా’ అని అడిగిన ఫ్యాన్.. నిజంగానే బేక్ చేసి పంపిన ఎన్టీఆర్!

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెర పైనే కాదు, నిజజీవితంలోనూ తనకున్న పెద్ద మనసును చాటుకున్నారు. సాధారణంగా నటీనటులు తమ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ను పంచుకుంటూ ఉంటారు. కానీ తారక్ తాజాగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఒక రేర్ అండ్ హార్ట్ టచింగ్ వీడియోను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఆయన మొదటిసారి స్వయంగా ఇంట్లోనే కుకీస్ (బిస్కెట్లు) బేక్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ కుకీస్ తారక్ తన కోసం చేసుకోలేదు, తన ఇద్దరు చిట్టి అభిమానుల కోసం పంపించడమే ఇక్కడ విశేషం. ఈ అద్భుతమైన జెస్చర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను మెల్ట్ చేస్తోంది.

“నాట్ బాట్.. బేక్డ్”.. క్యాజువల్ కామెంట్‌కు క్రేజీ సర్ప్రైజ్!

శనివారం జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. “Baked, not bought” (కొన్నవి కావు, నేనే బేక్ చేశాను) అని రాసుకొచ్చారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ చూస్తే.. అంతకుముందు తారక్ పెట్టిన ఒక పోస్ట్‌కు సాయి తేజ అనే అభిమాని ఎక్స్ (ట్విట్టర్) లో స్పందిస్తూ.. "అన్నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాకు రెండు కుకీస్ కావాలి" అని సరదాగా కామెంట్ పెట్టారు. దానికి ఎన్టీఆర్ మొదట బ్రహ్మానందం గారి ఫన్నీ జిఫ్‌తో రిప్లై ఇచ్చి నవ్వించారు.

కానీ కథ అక్కడితో అయిపోలేదు! ఆ క్యాజువల్ కామెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న ఎన్టీఆర్, నిజంగానే స్వయంగా చాక్లెట్ చిప్ కుకీస్ బేక్ చేసి, తన ఆటోగ్రాఫ్‌తో సహా సదరు అభిమాని ఇంటికి పార్సిల్ పంపించారు.

క్లౌడ్ నైన్ లో ఫ్యాన్ ఫ్యామిలీ.. నెటిజన్లు ఫిదా!

తారక్ పంపిన కుకీస్ బాక్స్ ఇంటికి చేరడంతో ఆ అభిమాని సాయి తేజ తన పిల్లలు స్మరణ్, స్మారక ఆ బిస్కెట్లను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎక్స్‌లో పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు.

"చాలా చాలా థాంక్యూ తారక్ మామ. ఒక క్యాజువల్ కామెంట్‌గా మొదలైన విషయం ఇంతటి మధురమైన సర్ప్రైజ్‌గా మారుతుందని ఊహించలేదు. ఈ రోజు కుకీస్ మా ఇంటికి చేరాయి. పిల్లలు ఫుల్ హ్యాపీ, ఆటోగ్రాఫ్ చూసి నేను క్లౌడ్ నైన్ లో ఉన్నాను. ఒక్కోసారి ఇంటర్నెట్ అనేది కేవలం నాయిస్ మాత్రమే కాదు.. అభిమానానికి, మానవత్వానికి, జ్ఞాపకాలకు మధ్య ఒక చిన్న వారధిలా మారుతుందని ఈ రోజు నిరూపితమైంది" అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు "అందుకే తారక్‌ను అందరూ అంతలా ప్రేమిస్తారు, ఫ్యాన్స్‌ను ఫ్యామిలీలా చూసుకుంటారు" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీ బిజీ!

ఇక సినిమాల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story