JD Chakravarthy Jayasudha Story: సహజనటికి జేడీ చక్రవర్తి లవ్‌ ప్రపోజ్‌... రాఘవేంద్రరావుకు షాక్‌

JD Chakravarthy Jayasudha Story: టాలీవుడ్ విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి తన కెరీర్ ఆరంభంలో సీనియర్ హీరోయిన్లతో ప్రవర్తించిన తీరు, సెట్స్‌లో ఆయన చేసిన అల్లరి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Balachander
Published on: 24 April 2026 12:10 PM IST
JD Chakravarthy Jayasudha Story
X

JD Chakravarthy Jayasudha Story

JD Chakravarthy Jayasudha Story: టాలీవుడ్ విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి తన కెరీర్ ఆరంభంలో సీనియర్ హీరోయిన్లతో ప్రవర్తించిన తీరు, సెట్స్‌లో ఆయన చేసిన అల్లరి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా సీనియర్ నటి జయసుధతో తన అనుబంధం, అలాగే వాణీశ్రీతో జరిగిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జేడీ చక్రవర్తి అంటే గుర్తుకు వచ్చేది శివ సినిమా. అందులో ఆయన నటన వైవిధ్యంగా ఉంటుంది. మాటలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆనాటి నటుడు జేడీ చెప్పిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం.

జయసుధ రోజుకు 50 సార్లు 'ఐ లవ్ యూ'

సహజంగా నటించేవారంటే జేడీకి అత్యంత ఇష్టం. అందుకే జయసుధ అంటే ఆయనకు అమితమైన గౌరవం, ఇష్టం. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో జయసుధను ఆటపట్టించేందుకు రోజుకు ఆయన 50సార్లు ఐ లవ్‌యూ సుధా అని చెప్పేవారట. జయసుధ తన తల్లితరం హీరోయిన్‌ అయినప్పటికీ తనకున్న చనువుతో అలా చెప్పేవారని అన్నారు. రోజూ ఇలా ఐ లవ్‌ యు అని విసిగిస్తుండటంతో జయసుధ నీ నంబర్‌ ఎంత అని అడగ్గా ఏడు అని సమాధానం ఇచ్చారట. ఏడు నంబర్‌ ఉన్నవారంతా దొంగలేనని, రామ్‌ గోపాల్‌ వర్మ, కమల్‌ హాసన్‌ అందరూ అదే బాపతు అని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారట. దీని అంతరార్థమేమంటే మేథావులంతా ఒకేలా ఆలోచిస్తారని.

వాణీశ్రీతో 'ఫిలాసఫీ' పంచాయితీ

రాఘవేంద్రరావు దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా బాంబే ప్రియుడు సినిమా వచ్చింది. ఆరోజుల్లో ఆ సినిమా భారీ హిట్‌. అయితే, ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. సీనియర్‌ నటి వాణిశ్రీ సెట్స్‌కు వచ్చినపుడు జేడి చక్రవర్తి ఆమెను హాయ్‌ వాణి అని పలకరించారట. అంత పెద్ద నటి, సినిమా ఇండస్ట్రీలో గౌరవం, గుర్తింపు ఉన్న తనను ఏకవచనంతో పిలవడంతో కోపగించుకొని దర్శకుడు రాఘవేంద్రరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో రాఘవేంద్రరావు జేడీ చక్రవర్తిని మందలించారట. రాఘవేంద్రరావు మందలింపుతో వాణిశ్రీకి క్షమాపణలు చెప్పేందుకు వెళ్లాడు. అయితే ఆమెతో దాదాపు 30 నిమిషాలపాటు ఫిలాసఫీ గురించి మాట్లాడారు. అన్నీబీసెంట్‌, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారి కొటేషన్లు వాడి ఆమెను మెప్పించారు. వాణిశ్రీకి ఎవరిపైనైనా కోపం వస్తే ఆమెను సముదాయించడం చాలా కష్టం. కానీ, జేడీ చక్రవర్తి కేవలం అరగంటలో ఏం మాట్లాడి ఆమె కోపాన్ని పోగొట్టారో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. తనకు అంతుచిక్కని రహస్యాల్లో ఇదికూడా ఒకటని పలుమార్లు దర్శకేంద్రుడు చెప్పిన సంగతి తెలిసిందే.

మొత్తంగా చూసుకుంటే...జేడీ చక్రవర్తి కేవలం నటుడు మాత్రమే కాదు...అపారమైన జ్ఞానం సంపాదించిన వ్యక్తి కూడా. సీనియర్‌ నటులతో ఆయకున్న విలక్షణమైన అనుబంధం వినడానికి ఎంతో సరదాగా, ఆసక్తికరంగా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా, తనలోని వాక్చాతుర్యంతో ఎదుటివారిని మెప్పించగలగడం జేడీకే సొంతం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story