‘పెద్ది’ని దారుణంగా ట్రోల్ చేసిన పోస్ట్‌కు లైక్ కొట్టిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.

Srinivas Rao
Published on: 5 Jun 2026 9:51 AM IST
Janhvi Kapoor
X

‘పెద్ది’ని దారుణంగా ట్రోల్ చేసిన పోస్ట్‌కు లైక్ కొట్టిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం రాజుకుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘అచ్చియమ్మ’ క్యారెక్టర్‌ను విపరీతంగా అబ్జెక్టిఫై (ఆడవారిని కేవలం ఒక వస్తువులా చూపించడం) చేశారని, చివరికి హీరో చేతిలో ఆమె పాత్ర శారీరక దాడికి కూడా గురవుతుందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ వివాదంపై స్వయంగా హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించిన తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాను , డైరెక్టర్‌ను ఘోరంగా విమర్శిస్తూ పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను జాన్వీ కపూర్ లైక్ చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. “భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన అవమానం!”

ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రముఖ పేజీ ‘రెకమండేషన్ కమ్యూనిటీ’ పెద్ది సినిమాపై ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. దానికి “పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రధాన నాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం” అనే క్యాప్షన్ ఇచ్చింది.

రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో సమాజంలోని అన్యాయాలపై హీరో సోషియో-పొలిటికల్ పోరాటం చేస్తుంటే.. హీరోయిన్ జాన్వీ కపూర్‌ను మాత్రం కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, ఆమె నడుము షాట్స్‌పైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టాడని ఆ పోస్ట్‌లో తీవ్రంగా విమర్శించారు.

డైరెక్టర్ బుచ్చిబాబు సరిహద్దులు దాటారు!

"ఇలాంటి పాత్రలు ఒప్పుకున్నందుకు హీరోయిన్‌ను బ్లేమ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ అసలు కథ వేరే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే జాన్వీ కపూర్ ఆ అశ్లీల షాట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలను కేవలం గ్లామర్ బొమ్మల్లా చూపించే ఇండస్ట్రీ ధోరణికి వ్యతిరేకంగా ఆమె ప్రొఫెషనల్ లైన్ గీసింది. కానీ ఫైనల్ ఎడిట్‌లో దర్శకుడు ఆమె అభ్యంతరాలను తొలగించి, ఆ సీన్స్‌ను అలాగే ఉంచాడు. అంటే బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం ఒక దర్శకుడు హీరోయిన్ సమ్మతి కంటే తన నెంబర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు."

లైక్ చేసిన జాన్వీ.. షాక్‌లో టాలీవుడ్!

ఈ పోస్ట్‌పై జాన్వీ కపూర్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఆమె దీనిని ‘లైక్’ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే, ఆ పోస్ట్‌లో రాసిన ప్రతి మాటతో తను ఏకీభవిస్తున్నానని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. పొరపాటున లైక్‌ చేసి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు వైరల్ కావడంతో జాన్వీ ఆ పోస్ట్‌కు ఇచ్చిన లైక్‌ను తొలగించారు. దీనిని గమనించిన నెటిజన్లు స్క్రీన్ షాట్స్‌ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సినిమా ఇంత పెద్ద హిట్ అయిన వేళ, హీరోయిన్ ఇలాంటి నెగిటివ్ పోస్ట్‌ను లైక్ చేయడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్, టాలీవుడ్ నెటిజన్లు మండిపడుతున్నారు. “ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని (TFI) అవమానించడమే” అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. “తన హద్దులను గౌరవించని దర్శకుడికి జాన్వీ సరైన బుద్ధి చెప్పింది” అని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ‘పెద్ది’ సక్సెస్ టాక్‌ నడుమ ఈ ఇంటర్నల్ వార్ టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.






Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story