Irumudi: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సునామీ..గత పదేళ్లలో ఏకైక సినిమాగా సంచలనం!

Irumudi: మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Gagan kumar
Published on: 23 Aug 2026 12:14 PM IST
Irumudi
X

Irumudi: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సునామీ..గత పదేళ్లలో ఏకైక సినిమాగా సంచలనం!

Irumudi: మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, రెండు రోజుల్లోనే ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టి రూ. 50 కోట్ల క్లబ్‌ వైపు వేగంగా పయనిస్తోంది.

రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే.. గ్లోబల్ గ్రాస్.. రూ. 47.45 కోట్లు ఇండియా వైడ్ గ్రాస్.. రూ. 36.45 కోట్లు ఇండియా వైడ్ నెట్.. రూ. 31.40 కోట్లు ఓవర్సీస్ గ్రాస్.. రూ. 11.00 కోట్లు పదేళ్ల రికార్డు బ్రేక్..

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. రవితేజ కెరీర్‌లో గత పదేళ్లలో రెండో రోజే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా 'ఇరుముడి' నిలిచింది.

శని, ఆదివారాలు వీకెండ్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఈ వీకెండ్ ముగిసేసరికి కలెక్షన్ల గణాంకాలు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

దర్శకుడు శివ నిర్వాణ కుటుంబ భావోద్వేగాలను, మాస్ ఎలిమెంట్స్‌ను సమర్థవంతంగా తెరపైకి తెచ్చారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, రవితేజ కుమార్తె పాత్రలో చిన్నారి నక్షత్ర నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. నటులు అజయ్ ఘోష్, సాయి కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు.

జీవి ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రవితేజ ఖాతాలో చాలా కాలం తర్వాత సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story