అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లేటప్పుడు వణికిపోయా సాయి అభియంకర్!
Raaka: పాన్-ఇండియన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న యువ స్వరకర్త సాయి అభియంకర్, తన అనుభవాలను పంచుకుంటూ అల్లు అర్జున్ మ్యూజికల్ సెన్స్‌ను ప్రశంసించారు.
అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లేటప్పుడు వణికిపోయా సాయి అభియంకర్!
Raaka: పాన్-ఇండియన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న యువ స్వరకర్త సాయి అభియంకర్, తన అనుభవాలను పంచుకుంటూ అల్లు అర్జున్ మ్యూజికల్ సెన్స్‌ను ప్రశంసించారు. ఆయన దగ్గరకు తన పనిని తీసుకెళ్లేటప్పుడు తనకు ఎంతో ఆందోళనగా ఉండేదని సాయి పేర్కొన్నారు.
ప్రేక్షకుల నాడి తెలిసిన నటుడు అల్లు అర్జున్
బిల్బోర్డ్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సాయి అభియంకర్ మాట్లాడుతూ, "అల్లు అర్జున్ గారికి ప్రేక్షకుల అభిరుచులపై అద్భుతమైన అవగాహన ఉంది. ఏది వర్కవుట్ అవుతుంది, ఏది కాదో ఆయనకు బాగా తెలుసు. అందుకే, ‘రాకా’ కోసం మేము సిద్ధం చేసిన ట్యూన్స్‌ను ఆయనకు చూపించేటప్పుడు నాకు కాస్త భయం, ఆందోళన కలిగాయి. కానీ ఆయన సలహాలు ఎంతో విలువైనవి," అని తెలిపారు. అల్లు అర్జున్‌కు అద్భుతమైన మ్యూజికల్ సెన్స్ ఉందని ఆయన కొనియాడారు.
అంతర్జాతీయ స్థాయి సంగీత చర్చలు
‘రాకా’ సంగీతానికి సంబంధించి అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీతో జరిపే చర్చలు కేవలం పాటలకే పరిమితం కావని సాయి వెల్లడించారు. "మేము సంగీతం గురించి చర్చించేటప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, ట్రెండ్స్, ప్రస్తుతం యువత (Gen Z) ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో విశ్లేషిస్తాం. అట్లీ అన్న, అల్లు అర్జున్ గారు నిరంతరం కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తారు. వారిద్దరితో పని చేయడం నాకు గొప్ప అనుభవం," అని చెప్పారు.
‘రాకా’- భారీ అంచనాలున్న సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్
సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ , సూపర్ హీరో అంశాల కలయికతో వస్తున్న ‘రాకా’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సాయి అభియంకర్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, చెంబన్ వినోద్ జోస్, యోగి బాబు , ఫెమినా జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రం, రాబోయే కాలంలో అత్యంత భారీ పాన్-ఇండియన్ రిలీజ్‌లలో ఒకటిగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




