Rukmini Vasanth: బికినీలో రుక్మిణీ వసంత్.. కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ

Rukmini Vasanth: హీరోయిన్ రుక్మిణి వసంత్ గ్రీన్ కలర్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Naresh.k
Updated on: 23 May 2026 9:31 AM IST
Rukmini Vasanth
X

Rukmini Vasanth: బికినీలో రుక్మిణీ వసంత్.. కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ

Rukmini Vasanth bikini: కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోతోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో, హోమ్లీ లుక్స్‌తో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్‌లో వరుసగా బడా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ క్రేజీ బ్యూటీ.. తాజాగా ఒక హాట్ టాపిక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ ట్రెడిషనల్, క్లాసిక్ లుక్స్‌లో కనిపించే రుక్మిణి వసంత్.. ఒక్కసారిగా గ్రీన్ కలర్ బికినీలో మెరిసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చింది.

స్విమ్మింగ్ పూల్‌లో హాట్ ఫోజులు

ఒక ప్రముఖ మేగజైన్ కవర్ షూట్ కోసం రుక్మిణి వసంత్ గ్రీన్ కలర్ బికినీ ధరించి, స్విమ్మింగ్ పూల్‌లో రకరకాల బోల్డ్ ఫోజులు ఇచ్చినట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఎప్పుడూ చూడని ఈ గ్లామరస్ అవతార్‌ను చూసి ఒక్కసారిగా ఇంటర్నెట్ ఊగిపోయింది. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత ఏంటి అంటూ యూత్ అంతా షాక్‌కు గురయ్యారు. కొందరు నెటిజన్లు ఆమె గ్లామర్ లుక్‌ను పొగుడుతుండగా, మరికొందరు బోల్డ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

అయితే, ఈ వైరల్ ఫొటోలు ,వీడియోలపై సోషల్ మీడియాలో ఒక సరికొత్త చర్చ నడుస్తోంది. రుక్మిణి వసంత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ తన హద్దులు దాటి గ్లామర్ షో చేయలేదని, ఆమె బాడీ లాంగ్వేజ్‌కు ఈ బికినీ షూట్ అస్సలు సెట్ కాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు, వీడియోలు ఒరిజినల్ కాదనే అనుమానాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఎవరో ఆకతాయిలు క్రియేట్ చేసిన మార్ఫింగ్ వీడియోలని నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక ప్రముఖ మోడల్ బాడీకి రుక్మిణి వసంత్ ముఖాన్ని యాడ్ చేసి ఈ ఫేక్ కంటెంట్‌ను వైరల్ చేస్తున్నారని ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story