Gundamma Katha Secrets: గుండమ్మకథ ముచ్చట్లు...ఎవరుంటే వారితోనే షూటింగ్‌...పక్కాహిట్‌ స్కెచ్‌

తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గుండమ్మ కథ సినిమా ఎలా తెరకెక్కింది? అందుబాటులో ఉన్న నటులతోనే షూటింగ్ చేయడం నుంచి ఎన్టీఆర్ నిక్కర్ లుక్ వరకు ఈ బ్లాక్‌బస్టర్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 19 Jun 2026 3:06 PM IST
Gundamma Katha Secrets: గుండమ్మకథ ముచ్చట్లు...ఎవరుంటే వారితోనే షూటింగ్‌...పక్కాహిట్‌ స్కెచ్‌
X

Gundamma Katha Secrets: ఆనాటి రోజుల్లో సినిమా హిట్‌ కావాలంటే కథాబలం ఉండాలి. కథనాలు ఆకట్టుకునే ఉండాలి. ఇప్పటిలాగా అప్పట్లో భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉండవు. కళ్లు చెదిరే విజువల్స్‌ కనిపించవు. కథలో భాగంగానే ఏదైనా రావాలి. దీంతో పాటు టైటిల్‌ కూడా ఆకట్టుకునేలా ఉండాలి. కానీ, సినిమా స్కిప్ట్ పూర్తయ్యాక చక్రపాణి కథకు గుండమ్మకథ అనే పేరు పెట్టారు. గయ్యాళి గుండమ్మగా సూర్యాకాంతం నటించింది. అప్పటికే గయ్యాళి పాత్రలు వేయడంలో సూర్యాకాంతానిది చెయ్యితిరిగింది. కొత్తదనం ఉంటే బాగుంటుందనుకొని సినిమా కథకే ఆమె పేరు పెట్టారు. అంతేకాదు, పాత్రల విషయంలోనూ యూనిట్‌ వినూత్నమైన పంథాను ఎంచుకుంది.

స్టూడియోలోనే సెట్టింగ్‌...అందుబాటులో ఉన్నవారితోనే షూటింగ్‌

గుండమ్మ ఇంటి సెట్టుని వియవారి స్టూడియోలోనే వేయించారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. అందరినీ ఒకేసారి తీసుకొచ్చి చేయించాలంటే కష్టం. అందుకే ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే షూటింగ్‌ చేశారు. చక్రపాణి ఉదయాన్నే స్టూడియోకి వచ్చి ఆర్టిస్టులందరికీ ఫోన్లు చేసేవారట. ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే షూటింగ్‌. ఈ విధంగా సినిమా పూర్తికావడానికి సుమారు ఏడాది పట్టింది.

సూర్యాకాంతం అందుబాటులో ఉంటే ఆమెతో పాటు రమణారెడ్డి లేదా మరెవరు అందుబాటులో ఉంటే వారితోనే షూటింగ్‌ చేశారు. ఎవరితో షూటింగ్‌ చేసినా స్క్రిప్ట్‌ ప్రకారమే ఎడిటింగ్‌ చేయించారు. ఫస్ట్‌ కాపీ సిద్దమైంది. సినిమా విడుదలకు పదిరోజుల ముందు ఎల్వీప్రసాద్‌ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఇంటికి వచ్చినవారి కోసం సినిమా వేయించారు. వచ్చినవారంతా సినిమా చూసి ఎబ్బే సినిమాలో పెద్దగా ఏమీ లేదని నోరెళ్లబెట్టారు. విమర్శలు గుప్పించారు. కానీ, దర్శక నిర్మాతలకు ఆ సినిమాపై బోలెడంత నమ్మకం ఉంది.

సక్సెస్‌ ఫార్ములా

ఇక్కడ హిట్‌ ఫార్ములా ఏమంటే...అప్పటి వరకు రామారావు పొడుగు సల్లాటం లేదా పంచెల్లో కనిపించగా...ఈ సినిమాలో సూర్యాకాంతం ఇంటికి వచ్చిన ఎన్టీఆర్‌...నిక్కరు చొక్కా వేసుకొని వస్తారు. ఆయన్ను చూడగానే నాటి రోజుల్లోని చిన్నారులు పడిపడి నవ్వుతారు. పిల్లలను ఆకట్టుకుంటే చాలు సినిమా ఆటోమేటిక్‌గా హిట్టే. ఇక కుటుంబానికి కావలసిన కథ ఉండనే ఉంది అన్నది చక్రపాణి నమ్మకం. ఆ నమ్మకం నిజమైంది. సినిమా విడుదల తరువాత బంపర్‌ హిట్టయింది. నేటికీ గుండమ్మకథను సినీ మేకర్స్‌ పరిశోధనాత్మక అంశంగా తీసుకుంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story