Obsession: రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 1000 కోట్ల కలెక్షన్లు.. ఈ హారర్ థ్రిల్లర్ స్టోరీ తెలిస్తే మతిపోతుంది

Obsession: సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలా? కేవలం 7 కోట్ల బడ్జెట్‌తో, 20 రోజుల్లో తెరకెక్కిన ఒక చిన్న హాలీవుడ్ హారర్ సినిమా ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది.

Ravi
By Ravi
Published on: 2 Jun 2026 11:38 AM IST
Obsession
X

Obsession: రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 1000 కోట్ల కలెక్షన్లు.. ఈ హారర్ థ్రిల్లర్ స్టోరీ తెలిస్తే మతిపోతుంది

Obsession: సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే భారీ బడ్జెట్, పెద్ద స్టార్ కాస్టింగ్, వందల కోట్ల ఖర్చు కచ్చితంగా ఉండాలని మనం అనుకుంటాం. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2', 'మైఖేల్', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టాయి. అయితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఒక చిన్న హాలీవుడ్ సినిమా ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. వందల కోట్ల సినిమాలను పక్కనపెట్టి, 2026 సంవత్సరంలోనే అత్యధిక లాభాలు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఆ సినిమా పేరే 'అబ్సెషన్'. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. కర్రీ బార్కర్ అనే 26 ఏళ్ల యూట్యూబర్ ఈ సినిమాను రాసి, ఎడిట్ చేసి, స్వయంగా దర్శకత్వం వహించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఈ సినిమా మొత్తం బడ్జెట్ కేవలం రూ. 7 కోట్లు. పైగా ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కేవలం 20 రోజుల్లోనే ఎంతో వేగంగా పూర్తి చేశారు. కానీ థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమా సాధించిన వసూళ్లు అక్షరాలా రూ. 1260 కోట్లు. అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా 10,000 శాతం పైగానే లాభం వచ్చిందన్నమాట! బడ్జెట్‌తో పోలిస్తే 'ధురంధర్ 2', 'మైఖేల్' లాంటి పెద్ద సినిమాలకు కూడా ఈ రేంజ్ లాభాలు రాలేదు.

ఇంతకీ ఈ సినిమాలో అంత ఏముందంటే.. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవారెట్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. చిన్ననాటి స్నేహితురాలి ప్రేమను దక్కించుకోవడం కోసం, కోరికలు తీర్చే ఒక విచిత్రమైన అతీంద్రియ శక్తి ఉన్న బొమ్మను హీరో వాడతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి భయంకరమైన మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా కథ. ఒక చిన్న పాయింట్‌ని ఎంతో ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులను భయపెట్టేలా తీయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

ఒక యూట్యూబర్ తీసిన ఈ చిన్న సినిమా ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. డబ్బులు ఉంటేనే గొప్ప సినిమాలు తీయగలం అన్నది పాత మాట. మనలో ఒక బలమైన కథ, దాన్ని ప్రేక్షకులకు అద్భుతంగా చెప్పాలనే కసి ఉంటే.. బడ్జెట్ ఎంత చిన్నదైనా ప్రపంచాన్ని జయించవచ్చు అని ఈ సినిమా నిరూపించింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story