బ్రహ్మాజీ కొడుకు కొత్త సినిమా.. ‘హిట్ అండ్ రన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్!

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్టార్ కామెడీ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది.

Srinivas Rao
Published on: 30 May 2026 7:22 PM IST
బ్రహ్మాజీ కొడుకు కొత్త సినిమా.. ‘హిట్ అండ్ రన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్!
X

బ్రహ్మాజీ కొడుకు కొత్త సినిమా.. ‘హిట్ అండ్ రన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్!

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్టార్ కామెడీ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. ‘ఓ పిట్ట కథ’, ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమాలతో భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్.. ఇప్పుడు ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘హిట్ అండ్ రన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

రక్తపు మరకలతో సంజయ్ రావ్ ఇంటెన్స్ లుక్

హీరో సంజయ్ రావ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ను గ్రాండ్‌గా విడుదల చేసింది. డార్క్, గ్రిట్టీ టోన్‌తో కూడిన బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. పోస్టర్‌లో సంజయ్ రావ్ ముఖంపై తీవ్రమైన గాయాలు, ఎండిపోయిన రక్తపు మరకలతో చీకటి నీడల నుండి బయటకు వస్తున్న లుక్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. శారీరక హింసతో పాటు తీవ్రమైన మానసిక సంఘర్షణను అనుభవిస్తున్న ఒక పవర్‌ఫుల్ పాత్రలో ఆయన నటించబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ హింట్ ఇస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పొగమంచు వాతావరణం కథలోని సస్పెన్స్, డేంజర్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేస్తోంది.

క్రైమ్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ

సాయి కృష్ణ సాగర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటాషా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో, ఈ సినిమా కూడా అదే బాటలో ఒక సాలిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

భారీ తారాగణం.. త్వరలోనే టీజర్

ఈ వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్‌లో సంజయ్ రావ్, నటాషా సింగ్‌లతో పాటు కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్ , జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ ఫ్రంట్‌లో ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. విజయ్ భాస్కర్ సద్దాల, ఎల్ గంగాధర్ సినిమాటోగ్రాఫర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరిలో క్యూరియాసిటీని పెంచేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ క్రేజీ టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story