షారుఖ్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు...!
Shah Rukh Khan: విమల్ ఏలకుల ప్రకటన ద్వారా నిషేధిత పాన్ మసాలాను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ షో-కాజ్ నోటీసులు జారీ చేసింది.
షారుఖ్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు...!
Shah Rukh Khan: షాకింగ్ ట్విస్ట్‌లు, భారీ కారెక్టరైజేషన్, మిస్టరీ... సాధారణంగా ఇవన్నీ మనం సిల్వర్ స్క్రీన్ పై చూస్తుంటాం. కానీ ఇప్పుడు బాలీవుడ్ బడా స్టార్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ జీవితాల్లో సరిగ్గా అలాంటి రియల్ లైఫ్ డ్రామా నడుస్తోంది. ఒక వైపు కోట్లాది అభిమానులను అలరించే సూపర్ స్టార్స్... మరోవైపు చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం ప్రకారం... మహారాష్ట్ర FDA అధికారులు నేరుగా బాలీవుడ్ అగ్ర నటుల ఇంటి తలుపులు తట్టారు. ఈ వ్యవహారంలో ముగ్గురి హీరోలకు నోటీసులు అందించడం జరిగింది. మహారాష్ట్రలో 2012 నుంచే FSS చట్టం, సెక్షన్ 30(2)(a) ప్రకారం పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా మరియు పాన్ మసాలాల తయారీ, విక్రయాలపై కఠినమైన నిషేధం అమల్లో ఉంది.
అయితే, సదరు నటులు నటించిన విమల్ ఏలకుల ప్రకటన, రాష్ట్రంలో నిషేధించబడిన విమల్ పాన్ మసాలా బ్రాండ్‌తో నేరుగా సంబంధం కలిగి ఉందనేది FDA ప్రధాన అభియోగం. ఏలకులు పేరుతో పరోక్షంగా నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో FDA చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్లను రంగంలోకి దించింది. తప్పుదారి పట్టించే , మోసపూరితమైన ఆహార ప్రకటనలను నియంత్రించే నిబంధన. తప్పుదోవ పట్టించే ప్రకటనల ప్రచురణ లేదా ప్రచారంలో పాలుపంచుకున్న ఎవరికైనా ఏకంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం.
ఈ వివాదం కొత్తదేమీ కాదు. 2018లోనే విష్ణు పౌచ్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ షో-కాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే, తమ 'విమల్' బ్రాండ్ కింద భారత్‌లో ఎలాంటి పొగాకు ఉత్పత్తులను తయారు చేయడం లేదని సదరు కంపెనీ న్యాయపరంగా వాదించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ విక్రయాలు, నిషేధిత గుట్కా, పాన్ మసాలా వ్యాపారాలపై సంచలన దాడులు జరుపుతోంది. అందులో భాగంగానే ఈ స్టార్లపై కూడా చర్యలు ముమ్మరమయ్యాయి.
ఒకవైపు రీల్ లైఫ్‌లో షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం 'కింగ్' తో, అజయ్ దేవ్గన్ 'గోల్మాల్ 5' తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేటాడేందుకు సిద్ధమవుతుంటే... రియల్ లైఫ్‌లో మాత్రం సరోగేట్ అడ్వర్టైజింగ్ చుట్టూ తిరుగుతున్న ఈ చట్టపరమైన డ్రామాలో వారు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.




