Samantha: భర్త ముందే సమంతకు ప్రపోజ్ ..రాజ్ నిడిమోరు రియాక్షన్ చూస్తే!
Samantha: ‘మా ఇంటి బంగారం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
Samantha: భర్త ముందే సమంతకు ప్రపోజ్ ..రాజ్ నిడిమోరు రియాక్షన్ చూస్తే!
Raj Nidimoru: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన, అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. స్టేజ్ పైనే ఒక అభిమాని సమంతకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు హైదరాబాద్ ట్రైలర్ ఈవెంట్‌లో ఏం జరిగిందంటే..?
సోమవారం హైదరాబాద్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సమంతతో పాటు ఆమె భర్త, ఈ చిత్ర నిర్మాత అయిన రాజ్ నిడిమోరు కూడా హాజరై సందడి చేశారు. ఈవెంట్ సజావుగా సాగుతున్న సమయంలో.. నిర్మాత రాజ్ నిడిమోరు స్టేజ్ పై మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక డైహార్డ్ ఫ్యాన్ సెక్యూరిటీ వలయాన్ని దాటుకుంటూ ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. నేరుగా సమంత దగ్గరికి వెళ్లిన ఆ అభిమాని.. అందరూ షాక్ అయ్యేలా లవర్స్ ప్రపోజ్ చేసుకునే స్టైల్లో మోకాళ్లపై నిలబడ్డాడు. తన చేతిలో ఉన్న అందమైన పూల బొకేను సమంతకు అందిస్తూ తన అపరిమితమైన అభిమానాన్ని చాటుకున్నాడు.
రాజ్ నిడిమోరు కూల్ రియాక్షన్
సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సెలబ్రిటీలు లేదా బాడీగార్డ్స్ సీరియస్ అవుతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సమంత ఆ అభిమానిని చూసి అస్సలు కోప్పడలేదు. పైగా చాలా నవ్వుతూ, కూల్‌గా ఆ బొకేను అందుకుంది. అంతేకాదు, ఆ అభిమాని అడగ్గానే నవ్వుతూ సెల్ఫీ కూడా ఇచ్చి అతన్ని పంపించేసింది. మరోవైపు భర్త రాజ్ నిడిమోరు కూడా స్టేజ్ పై ఇంత జరుగుతున్నా ఏమాత్రం కంగారు పడకుండా, చాలా కూల్‌గా వ్యవహరించడం విశేషం. దంపతులిద్దరి మెచ్యూరిటీని, ఫ్యాన్స్ పట్ల ఉన్న గౌరవాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
జూన్ 19న ‘మా ఇంటి బంగారం’
ఈ క్రేజీ ఇన్సిడెంట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సమంత భర్త రాజ్ నిడిమోరు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. జూన్ 19వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సమంత-నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




