‘ఫాల్ 2’ భయానక ట్రైలర్ చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

Fall 2: నాలుగేళ్ల క్రితం ఉత్కంఠను రేపుతూ ప్రేక్షకులను సీట్ల అంచుల మీద కూర్చోబెట్టిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఫాల్’ (Fall) గుర్తుందిగా.

Srinivas Rao
Published on: 6 Jun 2026 2:44 PM IST
Fall 2
X

‘ఫాల్ 2’ భయానక ట్రైలర్ చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

Fall 2: నాలుగేళ్ల క్రితం ఉత్కంఠను రేపుతూ ప్రేక్షకులను సీట్ల అంచుల మీద కూర్చోబెట్టిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఫాల్’ (Fall) గుర్తుందిగా? కేవలం ఒక పాత టీవీ టవర్‌పై ఇరుక్కుపోయిన ఇద్దరు అమ్మాయిల కథతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆ సినిమాకు ఇప్పుడు మైండ్ బ్లాకింగ్ సీక్వెల్ రెడీ అయింది.

‘ఫాల్ 2’గా వస్తున్న ఈ చిత్రానికి ‘ఫాల్ 2: డెడ్‌పాయింట్’ (Fall 2: Deadpoint) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ లయన్స్‌గేట్ సంస్థ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈసారి మేకర్స్ భయాన్ని , ఎత్తును అంతకుమించి అనేలా పెంచేశారు.

ఊపిరాడనివ్వని ట్రైలర్ ఓపెనింగ్

లయన్స్‌గేట్ విడుదల చేసిన ఈ ట్రైలర్ అధిక ఎత్తులో మానవ శరీరం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందనే భయానక వాస్తవాన్ని వివరిస్తూ మొదలవుతుంది. “11,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ శాతం 13.7 శాతానికి పడిపోతుంది, గుండె వేగం పెరుగుతుంది, రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది, శ్వాస వేగవంతం అవుతుంది, భయం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురై భ్రమలు కలుగుతాయి.

నిర్ణయాధికారం దెబ్బతింటుంది..” అంటూ వచ్చే వాయిస్ ఓవర్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తుంది. ఆ వెంటనే పర్వతాల మధ్య 5,000 అడుగుల ఎత్తులో చిక్కుకున్న ఒక బ్యాక్‌ప్యాక్ కోసం జాక్స్ (హ్యారియెట్ స్లేటర్) ప్రాణాలకు తెగించి పోరాడటం ట్రైలర్‌లో చూడవచ్చు.

ఈసారి కథేంటంటే..?

మొదటి భాగంలో భయం తెలియకుండా టవర్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన హంటర్ సోదరి.. జాక్స్ ఈ సీక్వెల్‌లో ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. తన సోదరి జ్ఞాపకార్థం, హంటర్ పాత ఫ్రెండ్ తో కలిసి జాక్స్ ‘మౌంట్ క్వాన్’ అనే ప్రమాదకరమైన పర్వతాన్ని ఎక్కడానికి బయలుదేరుతుంది.

అయితే వారు వెళ్లే మార్గంలో ఊహించని విధంగా భారీ కొండచరియలు విరిగిపడటంతో, నేలకి 5,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో వేలాడుతూ ఇరుక్కుపోతారు. నిలువునా కళ్ళు తిరిగే లోయలు, భయానక నిజాలు, ఊహించని ట్విస్టుల నడుమ జాక్స్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి, తన భయాన్ని ఎలా గెలిచింది అనేదే ఈ సినిమా కథ.

కొత్త దర్శకులు.. సరికొత్త కాస్టింగ్

మొదటి భాగాన్ని స్కాట్ మాన్ తెరకెక్కించగా, ఈ సీక్వెల్‌ను హారర్, థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్స్ అయిన ‘ది స్పిరిగ్ బ్రదర్స్’ డైరెక్ట్ చేశారు. చిత్రంలో హ్యారియెట్ స్లేటర్‌తో పాటు అర్సెమా థామస్, టామ్ బ్రిట్నీ కీలక పాత్రల్లో నటించారు. మొదటి భాగంలో బెక్కీ (గ్రేస్ కారోలిన్ కర్రే), హంటర్ (వర్జీనియా గార్డనర్) కేవలం 2,000 అడుగుల టవర్‌పై ఇరుక్కుపోతే.. ఈసారి దానికి డబుల్ కంటే ఎక్కువ అంటే ఏకంగా 5,000 అడుగుల ఎత్తులో ఈ సర్వైవల్ ఫైట్ జరగనుంది. ఈ మోస్ట్ అవేటెడ్ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story