Director Shankar Birthday : ఒకప్పుడు ఇండియన్ జేమ్స్ కెమరూన్ ఇప్పుడు మాత్రం

Director Shankar Birthday : విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని 'భారతీయుడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి ఆల్ టైమ్ హిట్లతో పాటు పరాజయాలపై స్పెషల్ స్టోరీ.

Naresh.k
Updated on: 17 Aug 2026 9:50 AM IST
Director Shankar Birthday
X

Director Shankar Birthday : ఒకప్పుడు ఇండియన్ జేమ్స్ కెమరూన్ ఇప్పుడు మాత్రం!

Director Shankar Birthday Special: భారతీయ చలనచిత్ర రంగానికి బిగ్ బడ్జెట్, సామాజిక సందేశం, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ పరిచయం చేసిన అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. శంకర్. అసాధ్యమనుకున్న ఊహలకు తెరపై ప్రాణం పోస్తూ "ఇండియన్ జేమ్స్ కెమరూన్"గా పేరు తెచ్చుకున్న ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్లలతో పాటు, ఎదురుదెబ్బలను సైతం చవి చూశారు. దర్శకుడు శంకర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం.

మొదటి సినిమాతోనే (జెంటిల్‌మెన్) ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. లంచగొండితనానికి వ్యతిరేకంగా సాగే ఈ రివైంజ్ డ్రామా శంకర్ కెరీర్‌కు పునాది వేసింది. కమల్ హాసన్‌తో తీసిన భారతీయుడు సినిమా శంకర్ పేరును దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసింది. అవినీతిపై పోరాడే వృద్ధుడి పాత్ర భారతీయ సినిమాలో ఒక మైలురాయి. ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా వచ్చిన జీన్స్ ప్రపంచంలోని ఏడు వింతల్లో చిత్రీకరించిన పాటలతో ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేశారు.

ఒక రోజు ముఖ్యమంత్రి అనే నవ్యమైన పాయింట్‌తో రాజకీయ వ్యవస్థపై ఎక్కుపెట్టిన బాణం ఒకే ఒక్కడు చిత్రం. ఈ సినిమా ప్రభావం నేటితరం రాజకీయాలపై తీవ్రంగా కనిపిస్తుంది. విక్రమ్ నటన, శంకర్ టేకింగ్ కలసి బాక్సాఫీస్ దగ్గర సృష్టింని సునామీ అంతా ఇంతా కాదు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన అపరిచితుడు చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. శివాజీ , రోబో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తీసిన ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరుసటి స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా 'రోబో'లోని విజువల్ ఎఫెక్ట్స్ అప్పట్లో ఒక సంచలనం.

అలాగే శంకర్ కెరీర్‌లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్‌ని ఓసారి చూద్దాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన బాయ్స్ సినిమా సంగీతం పరంగా పెద్ద హిట్ అయినప్పటికీ, శంకర్ మునుపటి సినిమాల స్థాయి మెసేజ్, విజువల్స్ లేకపోవడంతో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. విక్రమ్ అద్భుతమైన నటన, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, కథనంలో నెమ్మదనం వల్ల ఐ సినిమా ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది.

రోబోకి సీక్వెల్‌గా వచ్చిన 2.0 సినిమా 3D విజువల్ వండర్ వసూళ్లు సాధించినప్పటికీ, మొదటి భాగం ఇచ్చినంత డ్రామాను, భావోద్వేగాలను అందించలేకపోయిందనే విమర్శలు వచ్చాయి.దాదాపు 28 ఏళ్ల తర్వాత వచ్చిన భారతీయుడు సీక్వెల్ శంకర్ మార్క్ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక రామ్ చరణ్‌తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతోనూ కొత్త సాంకేతికతను, వైవిధ్యాన్ని టాలీవుడ్‌తో సహా దేశీయ సినిమా రంగానికి పరిచయం చేయడానికి శంకర్ చేసిన కృషి అభినందనీయం. ఆయన మరిన్ని అద్భుతమైన దృశ్యకావ్యాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ.. శంకర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story