Gopichand Malineni: ఆ హీరోయిన్‌ను ఎందుకు తీసుకున్నావ్..మహేష్ బాబు మీమ్‌తో నెటిజన్‌కు గోపీచంద్ మలినేని కౌంటర్

బాలకృష్ణ చిత్రంలో రెండో హీరోయిన్‌గా డింపుల్ హయాతిని తీసుకున్నారనే వార్తలపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.

Naresh.k
Published on: 30 March 2026 10:58 AM IST
Gopichand Malineni
X

Gopichand Malineni: ఆ హీరోయిన్‌ను ఎందుకు తీసుకున్నావ్..మహేష్ బాబు మీమ్‌తో నెటిజన్‌కు గోపీచంద్ మలినేని కౌంటర్

Balakrishna : టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ 'వీరసింహారెడ్డి' టీమ్ మళ్ళీ వస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న 'NBK-111'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ సినిమా సెకండ్ హీరోయిన్ విషయంలో గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు డైరెక్టర్ గోపీచంద్ ఒకే ఒక్క మీమ్‌తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

డింపుల్ హయాతి ఎంట్రీ.. నెటిజన్ ఫైర్

NBK-111లో ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం యంగ్ బ్యూటీ డింపుల్ హయాతిని ఎంపిక చేశారంటూ ఒక వార్త వైరల్ అయ్యింది. దీనిపై ఒక నెటిజన్ తీవ్రంగా స్పందిస్తూ.. "ఇంత హైప్ ఉన్న సినిమాను ఇలా చెడగొట్టాలా? డింపుల్ బదులు రవీనా టాండన్‌ను తీసుకుంటే బాగుండేది, ఇదొక బ్లండర్ మిస్టేక్" అంటూ మేకర్స్‌పై విమర్శలు గుప్పించాడు.

గోపీచంద్ సూపర్ కౌంటర్

ఈ విమర్శలపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని చాలా కూల్‌గా, సెటైరికల్‌గా స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక ఫేమస్ మీమ్ వీడియోను షేర్ చేస్తూ.. "మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేనెవరికీ చెప్పలేదండి" అనే డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు. అంటే, డింపుల్ హయాతిని తీసుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా కేవలం పుకారు మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

ఇంతకీ ఆ రెండో హీరోయిన్ ఎవరు?

డైరెక్టర్ ఇచ్చిన ఈ క్లారిటీతో రూమర్లకు చెక్ పడినట్లయింది కానీ, అభిమానుల్లో ఉత్కంఠ మాత్రం తగ్గలేదు. మరి ఆ రెండో హీరోయిన్ ఎవరు? అనే చర్చ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌లో మొదలైంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. మరి ఆ 'రెండో హీరోయిన్' ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Naresh.k

Naresh.k

Next Story