Allu Arjun: అల్లు అర్జున్‌తో సినిమానా? నో చెప్పిన స్టార్ హీరోయిన్

Allu Arjun: అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ వదులుకుంది.

Naresh.k
Updated on: 10 July 2026 10:09 AM IST
Allu Arjun
X

Allu Arjun: అల్లు అర్జున్‌తో సినిమానా? నో చెప్పిన స్టార్ హీరోయిన్

Preethi Mukundhan: చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న హై-బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ, ఒక యంగ్ బ్యూటీ మాత్రం ఏకంగా ఈ లక్కీ ఛాన్స్‌నే రిజెక్ట్ చేసిందట. ఆ లక్కీ గర్ల్ మరెవరో కాదు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రీతి ముకుందన్.

తాజాగా విడుదలైన ‘బ్లాస్ట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రీతి ముకుందన్.. అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్‌ను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో డైరెక్టర్ అట్లీ స్వయంగా వెల్లడించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా ‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు డైరెక్టర్ అట్లీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాకా’ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

‘రాకా’ సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం మేము మొదట ప్రీతి ముకుందన్‌ను సంప్రదించాం. ఆమె నటనకు నేను పెద్ద అభిమానిని. కానీ, దురదృష్టవశాత్తూ అప్పటికే ప్రీతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల మా సినిమాకు డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయింది. దాంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఆమె వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ పాత్రను నటి ఫెమినా జార్జ్ కు ఇచ్చాం. ‘రాకా’లో ప్రీతితో కలిసి పని చేసే అవకాశం మిస్ అయినా.. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆమెతో ఒక సినిమా చేస్తాను అని అట్లీ చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రీతి ముకుందన్. ‘బ్లాస్ట్’ సినిమాలో మానసికంగా, శారీరకంగా దృఢమైన ఆడపిల్లగా ఆమె చూపించిన పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ‘హృదయం మురళి’ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

బన్నీ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినా.. అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ స్వయంగా ప్రీతి నటనను మెచ్చుకుంటూ, ఫ్యూచర్‌లో సినిమా చేస్తానని ప్రామిస్ చేయడం చూస్తుంటే.. ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.



Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story