Vishnu Priya: విష్ణు ప్రియపై ప్రముఖ దర్శకుడు ఫైర్.. ఎందుకు ఇదింతా అంటూ

Vishnu Priya: నటి వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు సంజీవ్ మేగోటిల ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది.

Naresh.k
Published on: 13 Jun 2026 9:23 AM IST
Vishnu Priya
X

Vishnu Priya: విష్ణు ప్రియపై ప్రముఖ దర్శకుడు ఫైర్.. ఎందుకు ఇదింతా అంటూ

Sanjeev Megoti: కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు సరిగ్గా ఒకరోజు ముందు వివాదం రాజుకుంది. వరలక్ష్మి రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా ప్రమోషన్లకు రావడం లేదని, డబ్బింగ్ విషయంలోనూ ఇబ్బంది పెట్టిందంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి ప్రెస్ మీట్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వరలక్ష్మి కూడా గట్టిగానే స్పందిస్తూ.. "నేను అరవను, కరుస్తా" అంటూ సోషల్ మీడియాలో పరోక్షంగా ఒక పవర్‌ఫుల్ కౌంటర్ ఇచ్చారు.

ఈ గొడవ సోషల్ మీడియాలో నడుస్తుండగా, బుల్లితెర నటి విష్ణు ప్రియ భీమినేని ఊహించని విధంగా వరలక్ష్మికి మద్దతుగా నిలిచారు. మీరు రెమ్యూనరేషన్ ఇచ్చేది యాక్టింగ్ కోసమే.. ప్రమోషన్స్ కోసం కాదు కదా అంటూ డైరెక్టర్‌ను ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. సినిమాతో ఎలాంటి సంబంధం లేని విష్ణు ప్రియ ఈ గొడవలోకి రావడంపై దర్శకుడు సంజీవ్ మేగోటి ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తీవ్రంగా స్పందించారు. 31 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ జనరేషన్‌లో ఉన్న విష్ణు ప్రియ ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఈ గొడవతో ఆమెకు సంబంధం ఏంటి? ప్రమోషన్స్ గురించి వరలక్ష్మితో మేము లీగల్ అగ్రిమెంట్ రాసుకున్నాం. ఆ అగ్రిమెంట్ గురించి తెలియకుండా విష్ణు ప్రియ నెగెటివ్‌గా ట్వీట్ చేసింది. డైరెక్టర్ రిలీజ్ టెన్షన్‌లో ఉన్న బాధను గుర్తించకుండా ఆ అమ్మాయి అలా ఎందుకు మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు అని సంజీవ్ మేగోటి ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తాను వరలక్ష్మిపై కక్షతో ఆ మాటలు అనలేదని సంజీవ్ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ సమయంలో చేతికి దెబ్బ తగిలినా వరలక్ష్మి ఎంతో సపోర్ట్ చేసిందని, అయితే సినిమా రిలీజ్ ప్రెజర్‌లో ప్రెస్ మీట్‌కు ఆమె రాలేదనే బాధతోనే ఆ వ్యాఖ్యలు దొర్లాయని సవరణ ఇచ్చుకున్నారు. దర్శకుడి ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వెంటనే మూవీ టీమ్‌పై ఫిలిం ఛాంబర్‌లో కంప్లైంట్ చేశారు. దాంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తెరవెనుక ఏం జరిగిందో కానీ, దర్శకుడు సంజీవ్ మేగోటి వెంటనే ఒక వీడియో రిలీజ్ చేస్తూ వరలక్ష్మికి బహిరంగ క్షమాపణలు చెప్పారు.

దర్శకుడు తగ్గిన వెంటనే వరలక్ష్మి కూడా పెద్ద మనసు చేసుకున్నారు. ఆయన క్షమాపణలు చెప్పిన వీడియోను షేర్ చేస్తూ.. నేను దర్శకుడిని క్షమించేస్తున్నాను. న్యాయం, నిజం ఎప్పుడూ గెలుస్తాయి. థ్యాంక్యూ ఫిలిం ఛాంబర్ అంటూ పోస్ట్ పెట్టడంతో ఈ హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. ఇండస్ట్రీలో ప్రమోషన్ల విషయంలో హీరో హీరోయిన్లకు, దర్శకులకు మధ్య వచ్చే ఈగో గొడవలు ఎలా ఉంటాయో ఈ ‘పోలీస్ కంప్లైంట్’ వివాదం మరోసారి నిరూపించింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story