Dhurandhar 2 First Day Collections: దురంధర్ 2 మొదటి రోజే కలెక్షన్ల సునామీ
Dhurandhar 2 First Day Collections: దురంధర్ 2 మూవీ మొదటిరోజే సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తీసుకువచ్చింది. ఆ వివరాలివే..
Dhurandhar 2 First Day Collections
Dhurandhar 2 First Day Collections: బ్లాక్ బస్టర్ అనే పదానికి అర్ధం మార్చేసింది దురంధర్ 2 మూవీ. ఏ మూవీకైనా ఎక్కడో అక్కడ నెగెటివ్ రివ్యూలు లేదా ప్రేక్షకుల నుంచి నెగెటివ్ రెస్పాన్స్ రావడం సహజం. ఎందుకంటే, మన దేశంలో వివిధ రాష్ట్రాల ప్రజలు.. వేర్వేరు భాషల సినిమాలు ఉన్నాయి. ఎవరి అభిరుచి వారిదే. హిందీలో సూపర్ హిట్ అయిన మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అనే గ్యారెంటీ లేదు. ఎప్పుడో ఒకసారి ఆ మేజిక్ జరుగుతుంది. ఆ మేజిక్ ముందు బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి మేజిక్ క్రియేట్ చేసింది దురంధర్ 2. అయితే, ఇది ఊహించనిది మాత్రం కాదు. దురంధర్ మొదటి పార్ట్ సాధించిన విజయం.. సృష్టించిన రికార్డులతో రెండో పార్ట్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.
ప్రేక్షకుల్లో క్రియేట్ అయిన హైప్ ను నిలుపుకుంటూ దురంధర్ 2 ట్రైలర్ మరింత అంచనాలు పెంపొందించింది. దీంతో మూవీ రిలీజ్ టైమ్ కి అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. ఇక సినిమా మొదటి రోజు కలెక్షన్స్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేశాయి. మూవీ ఫస్ట్ డే నే 250 కోట్ల రూపాయలు వసూళుక్కు చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక రికార్డ్. ఒక సీక్వెల్ కు మొదటిరోజు ఈ రేంజిలో కలెక్షన్స్ రావడం అంటే, ఆ సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఏ రేంజికి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..
మొదటి రోజే 250 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన దురంధర్ రాబోయే రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, సినిమా విడుదలైన ప్రతి చోటా.. ప్రతి థియేటర్.. ప్రతి షో ప్రేక్షకుల చప్పట్లతో దద్దరిల్లిపోతున్నాయి. దురంధర్ మొదటి పార్ట్ కంటే ఈ రెండో పార్ట్ మరింత బావుందని చెబుతున్నారు. దీంతో కలెక్షన్స్ రికార్డులు ఖాయం.
'ధురందర్ 2' ప్రీమియర్, మొదటి రోజు వసూళ్లతో కలిపి రూ. 236 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ. 172 కోట్లు భారతదేశంలో, రూ. 64 కోట్లు విదేశాల నుంచి వసూలయ్యాయి. భారతదేశంలో నికర వసూళ్లు రూ. 140 కోట్లుగా ఉన్నాయని బాలీవుడ్ రిపోర్ట్. ఈ సినిమా మార్చి 19న హిందీలో రూ. 103 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇది ఇప్పటివరకు వచ్చిన హిందీ చిత్రాలలో అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. 'ధురందర్ 2' తన ప్రీమియర్ షో ల నుంచే రూ. 40 కోట్లు ఆర్జించింది. ఈ సినిమా సునాయాసంగా రూ. 2000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని విమర్శకులు సైతం చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 34 వేల షోలు లభించడం విశేషం.
'ధురందర్ 2' మూవీలో రణవీర్ సింగ్ నటించారు. ఈ సినిమాకి ఆయనే స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ సహా పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక మూవీలో ట్విస్ట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. అలానే ఆదిత్యధర్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాని ఒక రేంజిలో నిలబెట్టారని అంటున్నారు. ఇక ధురందర్' సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇది సీక్వెల్‌కు సహాయపడుతోంది. అందుకే సినిమా వసూళ్లు గట్టిగా ఉన్నాయి. ఇంకా ఒక్కరోజే అయింది.. వరుసగా సెలవులు ఉన్నాయి సోమవారం నాటికే ఈ మూవీ వెయ్యికోట్లు దాటేసినా ఆశ్చర్యం లేదు.




