Pandu Master: డ్యాన్స్ మాస్టర్ పండుకు ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
Pandu Master: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (Pandu Master) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Pandu Master: డ్యాన్స్ మాస్టర్ పండుకు ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
Pandu Master: ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రయాణం మధ్యలో డ్రైవర్ కారు పక్కన ఆపాడు. ఆ సమయంలో పండు మాస్టర్ కారు నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉన్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. కారు తీవ్రంగా దెబ్బతినగా.. కారు పక్కనే ఉన్న పండు మాస్టర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి పండు మాస్టర్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు బలంగా గాయాలు అయినట్లు తోటి ప్రయాణికులు చెప్తున్నారు. ఆనందపురం సిఐ వాసు నాయుడు ప్రమాద తీరుపై ఆరా తీస్తున్నారు. బొలెరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.




