Chiru Leaks: చిరు లీక్స్.. పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసిన మెగా స్టార్

Chiru Leaks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌కు తగినట్లుగా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.

Srinivas Rao
Published on: 16 May 2026 4:30 PM IST
Chiru Leaks
X

Chiru Leaks: చిరు లీక్స్.. పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసిన మెగా స్టార్

Chiru Leaks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌కు తగినట్లుగా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే మే 18న ముంబై వేదికగా చిత్ర ట్రైలర్‌ను భారీ ఎత్తున లాంచ్ చేసేందుకు చిత్ర బృందం సర్వసిద్ధం చేసింది. అయితే, ఈ ట్రైలర్‌ను అందరికంటే ముందే వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన అద్భుతమైన రివ్యూను పంచుకోవడమే కాకుండా, ఎప్పటిలాగే తన మార్క్ 'చిరు లీక్స్'తో ఒక పవర్ ఫుల్ డైలాగ్‌ను కూడా లీక్ చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.

ఊహకు అందని విజువల్స్.. మైండ్ బ్లోయింగ్ రివ్యూ!

ట్రైలర్ చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. తన స్పందనను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. "పెద్ది ట్రైలర్ చూశాను.. వావ్! 3 నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్ ఒక కంప్లీట్ ఫైర్ పవర్ ప్యాక్డ్ విజువల్ ట్రీట్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం తమ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు.

వీరంతా కలిసి థియేటర్లలో రఫ్ఫాడించడం ఖాయం. ప్రేక్షకులు తమ ఊహల్లో ఈ సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నారో.. దాన్ని మించి ఈ ట్రైలర్ , సినిమా ఉంటుంది" అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఇందులో ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్, మాస్ మ్యాడ్‌నెస్ అన్నీ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయని ఆయన కొనియాడారు.

చిరు లీక్స్ రీలోడెడ్.. డైలాగ్ వైరల్

చాలా రోజుల తర్వాత మెగాస్టార్ తన లీకుల పరంపరను కొనసాగిస్తూ, ట్రైలర్‌లోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను అభిమానుల కోసం పంచుకున్నారు. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు.." అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌ను చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో పెట్టేసారు. ఈ డైలాగ్ లీక్ చేసినందుకు నవ్వుతూ.. "సారీ బుచ్చిబాబు.. ట్రైలర్ చూశాక అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను" అంటూ దర్శకుడిని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ డైలాగ్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

క్రీడా నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా

దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని పూర్తిగా ఉత్తరాంధ్ర నేపధ్యంలో, క్రీడా , కుస్తీ పోటీల అంశాలతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా తీర్చిదిద్దారు. రామ్ చరణ్ ఇందులో సరికొత్త మాస్, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ (గౌరనాయుడు పాత్రలో), జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ (రాంబుజ్జి పాత్రలో) కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'చికిరి చికిరి' పాట, అలాగే ఇటీవల విడుదలైన క్యారెక్టర్ గ్లింప్స్‌లు సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. జూన్ 4న థియేటర్లలో ఈ 'పెద్ది' పహిల్వాన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story