Chiranjeevi: చిరు ఛాలెంజ్‌లాంటి సంకల్పం రావాలంటే ఏం చేయాలి?

చిరంజీవి సంకల్పబలం చేతనే మెగాస్టార్‌గా ఇండస్ట్రీలో ఎదగగలిగారు. ప్రతి ఒక్కరిలోనూ ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సంకల్పంగా మార్చుకుంటే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు.

Balachander
Published on: 8 July 2026 4:25 PM IST
Chiranjeevi: చిరు ఛాలెంజ్‌లాంటి సంకల్పం రావాలంటే ఏం చేయాలి?
X

Chiranjeevi: చిరంజీవి ఛాలెంజ్‌ సినిమా గురించి అందరికీ తెలుసు. ఇందులో ఓ సాధారణమైన వ్యక్తి ఆరోజుల్లో ఛాలెంజ్‌ చేసి ఐదేళ్లలో 50 లక్షలు సంపాదించి రావు గోపాలరావు కూతురిని వివాహం చేసుకుంటాడు. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణంగా ఆ స్థాయిలో సంపాదించాలి అంటే ఎంతటి సంకల్పం అవసరం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఎవరూ ఊహించని విధంగా కష్టపడి, చేసిన ఛాలెంజ్‌ని నిరూపించుకుంటాడు చిరు. ఇది సినిమానే. కానీ, ఇందులో మనం ప్రధానంగా అర్ధం చేసుకోవలసింది సంకల్పం గురించే. ఇదే మనిషిని ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది. లేదా అథఃపాతాళానికి తొక్కేస్తుంది. మరి ఎలా సంకల్పాన్ని మనం సొంతం చేసుకోవాలి. దీనికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అన్నది మనకు ఎన్నో సినిమాల్లో చూపించే ఉన్నారు.

సంకల్పబలం ఎలా ఉండాలి

స్థిత ప్రజ్ఞతతో తీసుకునే నిర్ణయమే సంకల్పం. అంటే ఒక పని అనుకుంటే...దాని చుట్టూనే మన మనసు పరిభ్రమించాలి. దాని కోసమే నిరంతరం ప్రయత్నించాలి. అదే ఆశగా, శ్వాసగా ఉండాలి. దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. అడుగులు వేస్తుండాలి. పడినా లేచినా లక్ష్యం మారకూడదు. దిశ మారకూడదు. పురాణాల్లో ఏకలవ్యుడు, అర్జునుడు ఇలాంటి వారెందరో సంకల్పబలం చేతనే విజయాలు సొంతం చేసుకున్నారు.

శివశంకర వరప్రసాద్‌... చిరంజీవిగా

ఈ ఆధునిక కాలంలో శివ శంకర వరప్రసాద్‌ అనే సాధారణ వ్యక్తి చిరంజీవిగా, మెగాస్టార్‌గా అవతరించాడు అంటే దాని వెనుక ఆయన కృషి, సంకల్పం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. సినిమా కాబట్టి మూడు గంటల్లో అయిపోతుంది. కానీ, నిజ జీవితంలో ఒక సంకల్పం మనలో నాటుకొని మొలకెత్తితే...దానికి నీరుపోసి సాగుచేసి తోటలా పెంచాలి. చిరంజీవి సైకిల్‌ తొక్కిన విధానం గాని, స్వయంకృషిలో స్వయంగా ఎదిగేందుకు చెప్పులు కుట్టడంలో కావొచ్చు... సంకల్పం ఉంటే చేస్తున్న పనిలో నిమగ్నమౌతాం. ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతాం. అందుకే ఎల్లప్పుడు మనల్ని ప్రశ్నించేవారు మన పక్కన ఉండాలి. రావు గోపాలరావు మాదిరిగా. మన లోపాలను ఎత్తిచూపేవారు ఉన్నప్పుడే సంకల్ప బలం కొండంత పెరుగుతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story