Chennai Love Story: హౌస్​ఫుల్​ బోర్డు చూసి ఎన్నాళ్ళయింది.. హిట్ కొట్టేశావు పో

Chennai Love Story: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది.

Naresh.k
Published on: 29 July 2026 9:16 AM IST
Chennai Love Story
X

Chennai Love Story: హౌస్​ఫుల్​ బోర్డు చూసి ఎన్నాళ్ళయింది.. హిట్ కొట్టేశావు పో

Chennai Love Story: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయం చేరింది. ఆయన నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో రచ్చ చేస్తోంది. విడుదలై కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి, క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. వారాంతం పూర్తయి వర్కింగ్ డేస్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, థియేటర్లలో ఈ సినిమా జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

సోమవారం, మంగళవారం లాంటి వర్కింగ్ డేస్‌లో సాధారణంగా సినిమాల కలెక్షన్లలో భారీ డ్రాప్స్ కనిపిస్తుంటాయి. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ విషయంలో మాత్రం లెక్కలు వేరుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల థియేటర్లకు కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, మేజర్ సెంటర్స్‌లో సినిమా హోల్డ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. 4వ రోజుతో పోలిస్తే 5వ రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లలో స్వల్ప డ్రాప్స్ ఉన్నప్పటికీ, అవి చాలా లిమిటెడ్‌గానే ఉండటం విశేషం. ఈవినింగ్ మరియు నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్, కరెంట్ ట్రెండ్ చూస్తుంటే 5వ రోజు కూడా కలెక్షన్ల సునామీ ఖాయంగా కనిపిస్తోంది.

ఈవినింగ్, నైట్ షోల ఆక్యుపెన్సీ బాగుండటంతో రూ. 1.7 కోట్ల నుంచి రూ. 1.8 కోట్ల రేంజ్‌లో షేర్ సాధించే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ గనక పుంజుకుంటే ఈ లెక్క మరికొంత పెరిగే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్‌లో ట్యూస్‌డే ఆఫర్స్ వర్తించడంతో విదేశాల్లో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో స్టడీ రన్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5వ రోజున ఈ సినిమా రూ. 2.2 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది.

ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటి 3 రోజుల్లోనే సినిమా రూ. 24 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ. 19.21 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి రూ. 4.80 కోట్లు వసూలైంది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మొదటి రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మొత్తానికి వర్కింగ్ డేస్‌లోనూ సూపర్ స్టడీగా హోల్డ్ చూపెడుతున్న కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'.. లాంగ్ రన్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు భారీ లాభాలను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.




Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story