Peddi: ‘పెద్ది’కి సెన్సార్ షాక్.. ట్రెండింగ్ ‘చీకిరి’ సాంగ్ లిరిక్స్‌ పై కత్తెర!

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, వైవిధ్యమైన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.

Srinivas Rao
Published on: 23 May 2026 4:15 PM IST
Peddi
X

Peddi: ‘పెద్ది’కి సెన్సార్ షాక్.. ట్రెండింగ్ ‘చీకిరి’ సాంగ్ లిరిక్స్‌ పై కత్తెర!

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, వైవిధ్యమైన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు పరిశీలన పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న సెన్సార్ సర్టిఫికెట్ వివరాల ప్రకారం ఈ సినిమాకు బోర్డు పలు సంచలన మార్పులను, కత్తెర్లను సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది.

‘చీకిరి’ సాంగ్ లిరిక్స్‌లో మార్పులు

ఇటీవలే విడుదలై యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘చీకిరి’ పాటపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సాంగ్‌లో వచ్చే ‘సరుకు సామాన్’ అనే పదాన్ని మార్చాల్సిందిగా బోర్డు సూచించడంతో మేకర్స్ ఆ పదంలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఈ పాటలోనే కాకుండా, సినిమాలో ఉన్న పలు అభ్యంతరకర పదాలు, డైలాగులను కూడా సెన్సార్ బోర్డు పూర్తిగా మ్యూట్ చేయించింది. లీకైన సెన్సార్ నివేదిక ప్రకారం.. సినిమాలో పాత్రల తీవ్రతను చూపించడం కోసం వాడిన కొన్ని కటువైన, బూతు పదాలపై బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది

తగ్గని అంచనాలు.. థియేటర్లలో రచ్చ ఖాయం

ఇన్ని సెన్సార్ మార్పులు జరిగినప్పటికీ, ‘పెద్ది’ సినిమాపై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గకుండా రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. రామ్ చరణ్ సరికొత్త మాస్ అండ్ రగ్గడ్ లుక్, పల్లెటూరి నేపథ్యం, ఉద్వేగభరితమైన విజువల్స్ ప్రేక్షకులలో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ అన్ని సెన్సార్ కట్స్ తర్వాత వెండితెరపై ‘పెద్ది’ ఏ రేంజ్‌లో గర్జించబోతున్నాడో చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story