Actress Harassment : సినిమా ఛాన్స్ అంటూ.. నటిపై లైంగిక వేధింపులు.!

Actress Harassment : సినిమా రంగంపై ఉన్న ఇష్టంతో వెండితెరపై రాణించాలని వచ్చే ఎంతోమంది నటీనటులకు చిత్ర పరిశ్రమలో చేదు అనుభవాలు ఎదురవుతూనే..

G Krishna
Published on: 15 Jun 2026 10:00 AM IST
Actress Harassment
X

Actress Harassment 

Actress Harassment : సినిమా రంగంపై ఉన్న ఇష్టంతో వెండితెరపై రాణించాలని వచ్చే ఎంతోమంది నటీనటులకు చిత్ర పరిశ్రమలో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. అవకాశాల పేరుతో మోసాలు, లైంగిక వేధింపుల వంటి ఘటనలతో విసిగిపోయి కొందరు సినిమా రంగానికే దూరమవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ ఫిలింనగర్ పరిసరాల్లో ఇలాంటిదే మరో దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి, షూటింగ్ అయిపోయాక డబ్బులు ఇవ్వకుండా వేధించడమే కాకుండా.. కారులో తీసుకెళ్లి లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఒక క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలైన ఒక సినీ నటి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.

షూటింగ్ అయిపోయాక డబ్బులు ఎగ్గొట్టి..

పోలీసుల కథనం ప్రకారం.. ప్రసాద్ అనే వ్యక్తి క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సినీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి పరిచయం అవుతుంటాడు. ఈ క్రమంలోనే సదరు బాధితురాలికి 'ఆకాశంలో ఒకతార' అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. దానికి ఆ నటి ఒప్పుకోవడంతో గతేడాది (2025) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన షూటింగ్‌లో పాల్గొని తన పాత్రను పూర్తి చేసింది. అయితే షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆమెకు రావాల్సిన రూ. 90 వేల రెమ్యునరేషన్, అలాగే రూ. 38 వేల ట్రావెల్ ఖర్చులను ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ వచ్చాడు.

కారులో ఎక్కించుకుని అసభ్య ప్రవర్తన

ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయి పడ్డ డబ్బుల విషయమై మాట్లాడటానికి బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ సినీ నిర్మాత ఆఫీస్ దగ్గరకు రావాలని బాధితురాలిని ప్రసాద్ పిలిపించాడు. నమ్మి అక్కడికి వెళ్లిన ఆ నటికి డబ్బులు ఇవ్వకపోగా, ప్రసాద్ ఆమెను భయపెట్టి బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. తనకు లొంగిపోతేనే ఇండస్ట్రీలో మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, అందుకు తన కోరికలు తీర్చాలంటూ కారులోనే అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు.

పోలీసుల దర్యాప్తు

క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన ఆ నటి చివరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను వివరిస్తూ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story