Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఘోరం.. హోటల్ రూమ్‌లో మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి చేసిన సెలబ్రిటీ స్టైలిస్ట్!
Cannes: కేన్స్ చిత్రోత్సవాల్లో ఘోర కలికలం రేగింది. ఫ్రాన్స్‌లోని ఒక లగ్జరీ హోటల్ రూమ్‌లో మిస్ వెనెజువెలా 2025 ఆండ్రియా డెల్ వాల్‌పై ఆమె సెలబ్రిటీ స్టైలిస్ట్ లగునా కత్తెరతో ఘోరంగా దాడి చేశారు.
Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఘోరం.. హోటల్ రూమ్‌లో మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి చేసిన సెలబ్రిటీ స్టైలిస్ట్!
Cannes: సినీ, ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల (Cannes Film Festival) వేళ ఫ్రాన్స్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక 'మిస్ వెనెజువెలా 2025' (Miss Venezuela 2025) విజేత ఆండ్రియా డెల్ వాల్ (Andrea del Val)పై కేన్స్‌లోని హోటల్ రూమ్‌లో ఆమె స్వంత సెలబ్రిటీ స్టైలిస్ట్ లగునా కత్తెరతో కిరాతకంగా దాడి చేశారు. ఈ మేరకు మోడల్ ఆండ్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బాధితురాలు ఆండ్రియా డెల్ వాల్ సోషల్ మీడియాలో పంచుకున్న వీడియోలో ఆమె ముఖం, దుస్తులపై రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాడి జరిగిన హోటల్ గది అంతా వస్తువులతో చిందరవందరగా మారి ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టిన స్టైలిస్ట్ లగునా కూడా అదే గదిలో ఉండడం గమనార్హం. మంగళవారం రాత్రి ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఈ దారుణం చోటు చేసుకోగా.. ఆలస్యంగా ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఫ్యాషన్ పరిశ్రమ ఉలిక్కిపడింది.
అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేన్స్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో మోడల్ ఆండ్రియాకు, స్టైలిస్ట్ లగునాకు మధ్య కాస్ట్యూమ్స్ లేదా మేకప్ విషయంలో చిన్నపాటి వాగ్వాదం (Argument) జరిగింది. ఈ వివాదం కాస్తా ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన లగునా.. మేకప్ టేబుల్‌పై ఉన్న కత్తెరను తీసుకుని ఆండ్రియా ముఖం, శరీరంపై దాడి చేశారు.
గదిలో నుంచి కేకలు రావడంతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫ్రాన్స్ పోలీసులు సెలబ్రిటీ స్టైలిస్ట్ లగునాను ఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లగునా పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఫ్యాషన్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ అపశ్రుతిపై కేన్స్ చిత్రోత్సవ నిర్వాహకులు గానీ, ఫ్రాన్స్ ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.




