Bigg Boss: బిగ్‌బాస్ నటి ఇంట్లో ప్రముఖ బిజినెస్ మేన్ మృతదేహం

Bigg Boss: ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ కృషి తపండా బెంగళూరు నివాసంలో వ్యాపారి వైశాఖ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Naresh.k
Published on: 26 Jun 2026 7:39 AM IST
Bigg Boss
X

Bigg Boss: బిగ్‌బాస్ నటి ఇంట్లో ప్రముఖ బిజినెస్ మేన్ మృతదేహం

Krishi Thapanda: సినీ పరిశ్రమలో మరో విషాదకర, సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ కృషి తపండా నివాసంలో ఓ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లో ఉన్న ఆమె అపార్ట్‌మెంట్‌లో వైశాఖ్ (33) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం రాత్రి ఆర్‌ఆర్ నగర్‌లోని ‘ఎలిగెంట్స్ అపార్ట్‌మెంట్‌’లో ఉన్న నటి నివాసానికి వైశాఖ్ వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అయితే, రాత్రి సమయంలో వైశాఖ్ నటి కృషి తపండాకు ఫోన్ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని విని షాక్‌కు గురైన నటి.. వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కానీ, దురదృష్టవశాత్తూ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. రూమ్‌లోకి వెళ్లిన వైశాఖ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. గురువారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఆర్‌ఆర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనిని అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు వైశాఖ్‌కు సంబంధించి కొన్ని నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. గతంలో అరవింద్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరిస్తూ లేఖలు పంపిన కేసులో ఇతను అరెస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, భార్యతో తీవ్రమైన కుటుంబ విభేదాలు ఉండటంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతను తరచూ నటి కృషి తపండా ఇంటికి వస్తుండేవాడని, లేదా అక్కడే ఉంటుండేవాడని తెలుస్తోంది.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వైశాఖ్ మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిజానిజాలు బయటకు తీసేందుకు నటి కృషి తపండాతో పాటు మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు త్వరలోనే విచారించనున్నారు.

కార్పొరేట్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృషి తపండా.. 2014లో ‘మిస్ కర్ణాటక’ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత కన్నడలో ‘అకిరా’, ‘కహి’ వంటి విలక్షణ చిత్రాల్లో నటించారు. మరీ ముఖ్యంగా ‘బిగ్‌బాస్ కన్నడ సీజన్-5’లో కంటెస్టెంట్‌గా పాల్గొని కన్నడ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. అలాంటి నటి ఇంట్లో ఈ తరహా ఘోరం జరగడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story