Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్ నుంచి గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్!

Bigg Boss 10: బిగ్‌బాస్ తమిళం 10వ సీజన్‌లో ఊహించని సంచలనం.

Gagan kumar
Published on: 10 Sept 2026 2:54 PM IST
Bigg Boss 10
X

Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్ నుంచి గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్!

Bigg Boss Tamil Season 10: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ కొత్త సీజన్లు ఇటీవల ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సందడి మొదలవ్వగా, ప్రసారమవుతున్న ప్రతి చోటా ఈ షో రసవత్తరంగా సాగుతోంది. అయితే, తమిళ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో మాత్రం ఎవ్వరూ ఊహించని ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది.

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ 10వ సీజన్, సెప్టెంబర్ 6న 19 మంది కంటెస్టెంట్లతో వైభవంగా ప్రారంభమైంది. తమిళంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘కుక్ విత్ కోమాలి’ షో ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న అన్సర్ కూడా ఒక కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు.

అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టిన రెండవ రోజే అన్సర్ ఏకంగా 20 అడుగుల ఎత్తున్న హౌస్ కాంపౌండ్ గోడపైకి ఎక్కి బయటకు పారిపోవడానికి ప్రయత్నించాడనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో నటుడు భరణి హౌస్ ఒత్తిడి తట్టుకోలేక గోడ ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, మళ్లీ ఇన్నాళ్లకు అన్సర్ అదే తరహాలో ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అన్సర్ హఠాత్తుగా ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి గల కచ్చితమైన కారణంపై నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. కానీ, హౌస్‌లో తోటి కంటెస్టెంట్ జేసన్‌తో జరిగిన ఘాటైన వాగ్వాదం, కెప్టెన్సీ చర్చల్లో తలెత్తిన అభిప్రాయ భేదాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడే దీనికి కారణమని సమాచారం.

తొలి వారంలోనే షోపై ఆసక్తి పెంచేందుకు, TRP రేటింగ్‌లు పెంచుకునేందుకు నిర్వాహకులు ఆడిస్తున్న డ్రామా కావచ్చునని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.బయట ఎంతో సరదాగా గడిపే కామెడీ ఆర్టిస్టులు బిగ్‌బాస్ నియమావళి, బంధీ వాతావరణం, తోటి సభ్యుల ఘర్షణలను తట్టుకోలేక హఠాత్తుగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందనేది మరొక వాదన.

మొత్తానికి, 'డెమోక్రసీ రూమ్', టీమ్‌ల విభజన వంటి కొత్త ప్రయోగాలతో మొదలైన తమిళ బిగ్‌బాస్ 10వ సీజన్ ప్రారంభంలోనే ఉత్కంఠ రేపుతోంది. రాబోయే ఎపిసోడ్‌లో హోస్ట్ విజయ్ సేతుపతి ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారు, అసలు అన్సర్ హౌస్‌లోనే ఉంటాడా లేదా బయటకు వచ్చేస్తాడా అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story