Ayesha Khan: పోలీసుల అదుపులో ‘ధురంధర్’ నటి .. ఏం చేసిందో తెలుసా..?
Ayesha Khan: ముంబై బాంద్రాలో నిరసన ప్రదేశానికి వెళ్లిన 'బిగ్ బాస్' ఫేమ్ నటి ఆయేషా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Ayesha Khan: పోలీసుల అదుపులో ‘ధురంధర్’ నటి .. ఏం చేసిందో తెలుసా..?
Ayesha Khan: ఢిల్లీ విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ముంబైలో జరిగిన ఆందోళన ప్రాంతానికి వెళ్లిన నటి ఆయేషా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రముఖ నటి, ‘బిగ్ బాస్’ ఫేమ్ ఆయేషా ఖాన్ అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలు, పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ ముంబైలోని బాంద్రా వద్ద ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిరసనకు మద్దతుగా నటి ఆయేషా ఖాన్ ఆ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే, ఆమె అక్కడికి వచ్చిన కొద్దిసేపటికే ముంబై పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.ఆయేషా ఖాన్ పోలీసులతో మాట్లాడి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు ఆమె మాటలను పట్టించుకోలేదు. తీవ్ర దురుసుగా ప్రవర్తిస్తూ ఆమెను బలవంతంగా పోలీస్ వ్యాన్‌లోకి తోసి స్టేషన్‌కు తరలించారు.
ఈ పరిణామాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘోర ఘటనపై తాజాగా స్పందించిన ఆయేషా ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను కేవలం నిరసన ప్రాంతానికి చేరుకున్నాను అంతే.. అక్కడ కార్యక్రమం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నన్ను బలవంతంగా వ్యాన్‌లోకి నెట్టేశారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు, నోటీసులు లేకుండా పోలీసులు ఇలా దురుసుగా ప్రవర్తించడం నన్ను ఎంతగానో కలచివేసిందంటూ ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చారు.
ఏం జరిగిందో వివరించే సమయం కూడా ఇవ్వకుండా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదేశానికి వచ్చిన ఒక నటి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ముంబైలో ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.




