Bigg Boss 10 Telugu: డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్ ..తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తొలివారం నామినేషన్లలో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఓటింగ్ రేసులో రోహిత్, ముఖేష్ గౌడ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Gagan kumar
Published on: 9 Sept 2026 4:26 PM IST
Bigg Boss 10 Telugu
X

Bigg Boss 10 Telugu: డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్ ..తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss Telugu Season 10 Elimination: బుల్లితెరపై అసలైన ఎంటర్టైన్మెంట్ హంగామా మొదలైపోయింది. 'అగ్నిపరీక్ష' ముగిసిందో లేదో.. వెంటనే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10 మొదటి రోజు నుంచే గొడవలు, డ్రామాలతో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే తొలివారంలోనే బిగ్ బాస్ ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 16 మంది కంటెస్టెంట్లను ఏకంగా నామినేషన్లలో పడేసి, ఎవరి అదృష్టం ఎటు తిరుగుతుందో చూసే బాధ్యతను పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో పెట్టేశాడు.

మొదటి రోజు ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. బయట ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉందో, హౌస్‌లో ఎవరికి సింపతీ వర్కవుట్ అవుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వారం ఓటింగ్ సరళిలో మగాళ్లదే పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. టాప్ 6 స్థానాల్లోనూ మేల్ కంటెస్టెంట్లే రాజ్యమేలుతూ, దాదాపు 60 శాతానికి పైగా ఓట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

'అగ్నిపరీక్ష' ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రోహిత్, ప్రస్తుతం ఓటింగ్ రేసులో టాప్ స్థానంలో దూసుకుపోతున్నాడు. హౌస్‌లోకి రాగానే త్రిగుణ్ మరియు ఇతర సభ్యులు ఇతడిని టార్గెట్ చేయడంతో, ప్రేక్షకుల్లో సింపతీ వేవ్ మొదలై రోహిత్‌కు మద్దతు విపరీతంగా పెరిగింది.

'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ తనకున్న భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రోహిత్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. హౌస్‌లో ప్రశాంతమైన ప్రవర్తనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తూ రెండో స్థానంలో స్థిరపడ్డాడు. జబర్దస్త్ టైమింగ్, కామెడీతో ఆకట్టుకుంటున్న రామ్ ప్రసాద్ మూడో స్థానంలో సేఫ్‌గా నిలిచాడు.

వీరి తర్వాత అమన్ మసూద్ 8%, త్రిగుణ్ 7%, కృష్ణుడు 7% ఆ తదుపరి స్థానాల్లో సేఫ్ జోన్‌లో ఉన్నారు. మహిళా కంటెస్టెంట్లకు ఈ వారం తీవ్ర నిరాశే ఎదురైంది. టాప్ 6లో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. సింగర్ ఝాన్సీ (6%), దేబ్జానీ (6%) మాత్రమే 7, 8 స్థానాల్లో నిలిచి కొంతవరకు పోటీ ఇస్తున్నారు. ఆ తర్వాత జబర్దస్త్ నరేష్ 5%, యాంకర్ వర్షిణి 4%, టెంపర్ వంశీ 3%, చరణ్, షాలిని, చైత్ర రాయ్ తలా 2% మాత్రమే సాధించగలిగారు.

ఈ వారం అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. సృష్టి, యాంకర్ సుధీర్ తలా 1% ఓటింగ్‌తో అట్టడుగున నిలిచి డేంజర్ జోన్‌లో పడ్డారు. తొలివారం కావడం వల్ల హౌస్ పర్ఫార్మెన్స్ కంటే బయట ఉన్న ఫ్యాన్ బేస్ మీదే ఓట్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం సృష్టి లేదా యాంకర్ సుధీర్‌లలో ఒకరు తొలివారంలోనే హౌస్ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది.

అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. వారంలో రాబోయే టాస్కులు, గొడవలు, కంటెస్టెంట్ల అసలు నైజం బయటపడే కొద్దీ ఓటింగ్ లెక్కలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఈ 16 మందిలో తమ ఓటింగ్ స్థానాలను ఎవరు పదిలం చేసుకుంటారు, మొదటి వారంలోనే సర్దుకుని వెళ్ళిపోయే ఆ దురదృష్టవంతమైన కంటెస్టెంట్ ఎవరో వేచి చూడాల్సిందే.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story