Bigg Boss: బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. ఇవాళ నో ఎలిమినేషన్!

Bigg Boss: బిగ్‌బాస్ 10లో తొలి వారంలో ఎలిమినేషన్ లేదని, 8 మంది కంటెస్టెంట్లు హై రిస్క్ జోన్‌లో ఉన్నారని ప్రకటన చేశారు హోస్ట్ నాగార్జున.

Ravi
By Ravi
Published on: 13 Sept 2026 5:11 PM IST
Bigg Boss
X

Bigg Boss: బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. ఇవాళ నో ఎలిమినేషన్!

Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన కొద్ది రోజులకే ఊహించని మలుపులతో ఆసక్తికరంగా మారుతోంది. దశావతారం కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌లో సాధారణ సీజన్లకు భిన్నంగా వరుస ట్విస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారం పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా వారాంతపు ఎపిసోడ్‌లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని భావించినప్పటికీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఎలిమినేషన్ లేకుండానే ఎపిసోడ్ ముగియనున్నట్లు సమాచారం వెలువడింది. ఇప్పటికే మిడ్ వీక్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లడం ఇందుకు కారణం.

చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ ఇంటిని వీడారు. వారు సీక్రెట్ రూమ్‌లో ఉన్నారని, తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి ఇంట్లోకి వస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో కూడా ఇలాంటి అనుమానాలు ఉండగా, హోస్ట్ నాగార్జున ఆ ఊహాగానాలకు తెరదించారు. కేవలం ఇంట్లోకి అడుగుపెట్టినంత మాత్రాన కంటెస్టెంట్లు హౌజ్‌మేట్స్‌గా మారరు. టాస్కులు, పరీక్షల్లో సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఆ హోదా దక్కుతుంది. రోహిత్ నాయుడు, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్ ఈ ప్రక్రియలో విజయం సాధించారు.

తాజా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా మరికొందరికి ఈ అవకాశం లభించింది. తాజా ఎపిసోడ్‌లో హీరో త్రిగుణ్ నాలుగో హౌజ్‌మేట్‌గా ఎంపికయ్యాడు. కామనర్ శాలినీకి ప్రేక్షకుల నుంచి భారీగా ఓట్లు రావడంతో ఆమె ఐదో హౌజ్‌మేట్‌గా నిలిచింది. ఎంపికైనంతరం శాలినీ తనకు మద్దతుగా ఓట్లు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపి, ఇకపై ఏడవకుండా ఆటపై దృష్టి పెడతానని ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ఎపిసోడ్ చివర్లో సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఆరో హౌజ్‌మేట్‌గా ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించడంతో ప్రస్తుతం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌మేట్స్‌గా మారారు.

ఆరుగురు కంటెస్టెంట్లు సేవ్ కావడంతో మిగిలిన ఎనిమిది మందిపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డి, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, ముఖేష్ గౌడ, కామనర్ అమన్ మసూద్, సింగర్ ఝాన్సీ హై రిస్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం వీరి ఆటతీరే కీలకం కానుంది. టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే వీరిలో ఎవరైనా ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో హౌస్‌లో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి. ప్రేక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించడానికి పోటాపోటీగా మద్దతు తెలుపుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.