Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ఉందా? సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2

Bigg Boss 10 Telugu: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సరికొత్త మైల్‌స్టోన్‌ను అందుకోబోతోంది.

Srinivas Rao
Updated on: 13 Jun 2026 2:58 PM IST
Bigg Boss 10
X

Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ఉందా? సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2

Bigg Boss 10 Telugu: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సరికొత్త మైల్‌స్టోన్‌ను అందుకోబోతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ షో.. ఇప్పుడు మరింత గ్రాండ్‌గా పదో సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఈ మైల్‌స్టోన్ సీజన్‌కు కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ, తన మార్క్ హోస్టింగ్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రోమోను మేకర్స్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ బజ్ పీక్స్‌కు చేరింది.

మళ్లీ రాబోతున్న ‘అగ్నిపరీక్ష సీజన్-2’

గత తొమ్మిదో సీజన్‌లో సరికొత్తగా ప్రవేశపెట్టిన 'అగ్నిపరీక్ష' కాన్సెప్ట్‌కు బుల్లితెర వీక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలకు కూడా హౌస్‌లోకి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ ఇవ్వడం.. అక్కడ వారి పోరాటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రయోగం సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు రాబోయే పదో సీజన్‌లో కూడా అదే ఫార్ములాను మరింత పవర్‌ఫుల్‌గా కంటిన్యూ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే సామాన్యుల కోసం ‘అగ్నిపరీక్ష సీజన్-2’ ను కింగ్ నాగార్జున ప్రోమో ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు.

అద్భుతాలు సృష్టించడానికి సామాన్యులకు మరో అవకాశం

మీలో టాలెంట్ ఉండి, బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాలనే గట్టి కల ఉంటే.. ఈ అగ్నిపరీక్ష మిమ్మల్ని నేరుగా బిగ్ బాస్ 10 స్టేజ్ పైకి తీసుకువెళ్తుంది.

జూన్ 12 నుంచి 20 వరకు ఆడిషన్స్.. అప్లై చేసుకోండి ఇలా!

ఈ అగ్నిపరీక్ష 2 డిజిటల్ ఆడిషన్స్ ప్రక్రియ జూన్ 12న ప్రారంభమై, జూన్ 20వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు క్రింది నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు:

అధికారిక వెబ్‌సైట్: ఆడిషన్స్ కోసం దరఖాస్తుదారులు రికార్డ్ చేసిన తమ వీడియోలను

https://bbtelugu.jiostar.com/

పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వీడియో నిబంధనలు

మీ వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను ప్రతిబింబించేలా స్పష్టమైన ఆడియో, వీడియో క్లారిటీతో కూడిన ఒక ప్రొఫైల్ వీడియోను తయారు చేయాలి. అందులో మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ఎందుకు అర్హులో, మీకున్న ప్రత్యేకత ఏంటో స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది.

జూన్ 10 నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన భారతీయ పౌరులందరూ ఈ ఆడిషన్లలో పాల్గొనడానికి అర్హులు. మీ ప్రొఫైల్‌తో పాటు సోషల్ మీడియా లింకులను కూడా జత చేయాల్సి ఉంటుంది.

మల్టిపుల్ లెవెల్స్ వడపోత.. ఆ తర్వాతే హౌస్‌లోకి ఎంట్రీ!

ఆన్‌లైన్ ద్వారా వచ్చే వీడియోలను బిగ్ బాస్ కాస్టింగ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించి, ఆపై గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూల వంటి దాదాపు 5 లెవెల్స్ వడపోత ప్రక్రియను నిర్వహిస్తారు. గత సీజన్‌లో అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు హౌస్‌లో సృష్టించిన హంగామా మనకు తెలిసిందే. మరి ఈ సారి సీజన్ 10 'అగ్నిపరీక్ష 2' ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ఆ లక్కీ కామన్‌మెన్ కంటెస్టెంట్స్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story