Bhagyashri Borse: హైదరాబాద్‌ నా రెండో ఇల్లు..ఆ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసేసిన హీరోయిన్..?

Bhagyashri Borse: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే, యంగ్ హీరో రామ్ పోతినేని గాఢమైన ప్రేమలో ఉన్నారంటూ వస్తున్నాయి.

Naresh.k
Published on: 22 Jun 2026 10:58 AM IST
Bhagyashri Borse
X

Bhagyashri Borse: హైదరాబాద్‌ నా రెండో ఇల్లు..ఆ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసేసిన హీరోయిన్..?

Bhagyashri Borse - Ram Pothineni: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తాజాగా మరింత బలం చేకూరింది. 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా షూటింగ్ సమయం నుంచే వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ లవ్ రూమర్స్‌పై ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా స్పందించనప్పటికీ.. తాజాగా భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సే తన మనసులోని మాటను బయటపెట్టారు. నా మొదటి ఇల్లు ఔరంగాబాద్ అయినప్పటికీ.. హైదరాబాద్‌తో నాకు ఎంతో స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. ఇప్పటికే నాకు ఇక్కడ ఒక సొంత ఇల్లు కూడా ఉంది అని వెల్లడించారు. భాగ్యశ్రీ భాగ్యనగరంలో ఇల్లు తీసుకున్న విషయం చెప్పగానే పక్కనే ఉన్న స్టార్ యాంకర్ సుమ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

భాగ్యశ్రీ ఇల్లు కొన్న విషయం వైరల్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు దీనికి రామ్ పోతినేని లవ్ ట్రాక్‌ను ముడిపెడుతున్నారు. రామ్‌కు దగ్గరగా ఉండటం కోసమే భాగ్యశ్రీ ముంబై, ఔరంగాబాద్‌లను వదిలి హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలని చూస్తోందని, త్వరలోనే ఈ జోడీ పెళ్లి గుడ్ న్యూస్ చెప్పడం ఖాయమని సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ లవ్ రూమర్స్ పక్కన పెడితే.. భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా దూసుకుపోతున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఒకవైపు రామ్‌తో లవ్ అండ్ మ్యారేజ్ రూమర్స్, మరోవైపు అఖిల్ సినిమాతో బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ అవుతుండటంతో టాలీవుడ్‌లో ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు మార్మోగిపోతోంది.





Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story