Trisha: మీ కలలు నిజమయ్యాయి త్రిష: బండ్ల గణేష్

Bandla Ganesh: తమిళ అగ్ర కథానాయిక త్రిష పుట్టినరోజు (మే 4, 2026) సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Srinivas Rao
Updated on: 4 May 2026 12:33 PM IST
Bandla Ganesh Cryptic Tweet to Trisha Amidst Vijay Political Storm
X

Bandla Ganesh Cryptic Tweet to Trisha Amidst Vijay Political Storm

Bandla Ganesh: తమిళ అగ్ర కథానాయిక త్రిష పుట్టినరోజు (మే 4, 2026) సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె పుట్టినరోజు వేడుక కంటే కూడా, తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధిస్తున్న సంచలన విజయం నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుమల సన్నిధిలో త్రిష

దక్షిణాది వెండితెర రాణి త్రిష నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని ఆమె ఆదివారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం సాధారణ భక్తురాలిగా, నిరాడంబరమైన దుస్తుల్లో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో తనను గుర్తుపట్టిన అభిమానులకు ఆమె చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విజయ్ ‘విజయ’ దుందుభి.. త్రిష మొక్కులు?

ఈ పర్యటన వెనుక కేవలం పుట్టినరోజు మాత్రమే కాకుండా ఒక బలమైన రాజకీయ సెంటిమెంట్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ, విజయ్ పార్టీ ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికార పీఠం దిశగా దూసుకుపోతోంది. విజయ్ రాజకీయంగా విజయం సాధించాలని త్రిష తిరుమలలో మొక్కులు తీర్చుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

బండ్ల గణేష్ ట్వీట్.. నెటిజన్ల విశ్లేషణలు

టాలీవుడ్ సెన్సేషనల్ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. "అభినందనలు త్రిష.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కలలు నెరవేరాయి" అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. సాధారణంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో 'కలలు నెరవేరాయి' అని బండ్లన్న వాడటం వెనుక విజయ్ రాజకీయ విజయమే ఉందన్నది బహిరంగ రహస్యం.


కొత్త చరిత్ర దిశగా దళపతి

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం, విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ భారీ మెజారిటీతో విజయం దిశగా వెళ్తుండటంతో త్రిష తిరుమల పర్యటన చర్చనీయాంశమైంది. విజయ్ , త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్నో ఏళ్లుగా రూమర్లు వస్తున్న నేపథ్యంలో, ఆయన విజయం కోసం ఆమె చేసిన ప్రార్థనలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story