Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు, టాలీవుడ్ ప్రముఖులు

Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది.

Ravi
By Ravi
Published on: 16 Aug 2026 5:36 PM IST
Bandla Ganesh
X

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహం.. హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు, టాలీవుడ్ ప్రముఖులు

Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఇటీవల వేడుకల సందడి నెలకొంది. ఆయన కూతురు జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో జేఆర్సీ కన్వెక్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, నూతన దంపతులను స్వయంగా ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కుటుంబంతో హాజరై, నూతన దంపతులను ఆశీర్వచనాలు అందించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ఈ వివాహ వేడుకకు విచ్చేశారు. బండ్ల గణేష్‌తో పవన్ కళ్యాణ్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి మనకు తెలిసిందే. నూతన వధూవరులను పవన్ దంపతులు ఆశీర్వదించి బండ్ల గణేష్ కుటుంబానికి అభినందనలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వేడుకకు విచ్చేసి దంపతులను ఆశీర్వదించారు.

అటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య, శోభిత, బ్రహ్మానందం, గోపీచంద్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నూతన నటీనటులు కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story