అల్లు అర్జున్ ‘రాకా’ నుండి అదిరిపోయే అప్‌డేట్..
‘రాకా’ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను మరో రెండు నెలల తర్వాత, అంటే ఈ ఏడాది ఆగస్ట్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ యాక్షన్ విజువల్ వండర్ ‘రాకా’. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియన్ సినిమా స్క్రీన్‌లపై మునుపెన్నడూ చూడని ఒక నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆగస్ట్‌లో ‘రాకా’ ప్రపంచాన్ని పరిచయం చేయనున్న అట్లీ!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అత్యంత శరవేగంగా సాగుతోంది. దర్శకుడు అట్లీ తన పక్కా ప్లానింగ్ ప్రకారం షెడ్యూల్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిం నగర్ వర్గాల నుండి ఒక మైండ్ బ్లోయింగ్ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘రాకా’ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను మరో రెండు నెలల తర్వాత, అంటే ఈ ఏడాది ఆగస్ట్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ గ్లింప్స్ ద్వారా ‘రాకా’ సినిమా ప్రపంచం ఎలా ఉండబోతోంది? విజువల్స్ రేంజ్ ఏంటి? అనే దానిపై ప్రేక్షకులకు ఒక అద్భుతమైన క్లారిటీ ఇవ్వనున్నారని టాక్.
మూడు విభిన్న శేడ్స్‌లో ఐకాన్ స్టార్ రచ్చ
ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మునుపటి చిత్రాల కంటే ఎంతో భిన్నంగా, వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. కథ ప్రకారం బన్నీ ఈ చిత్రంలో మొత్తం మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించనున్నారట. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ మూడు లుక్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ఆగస్ట్ గ్లింప్స్ అప్‌డేట్‌పై సన్ పిక్చర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
టాప్ టెక్నీషియన్లతో సన్ పిక్చర్స్ భారీ నిర్మాణం
కోలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ ‘సన్ పిక్చర్స్’ ఈ చిత్రాన్ని వందల కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కరుప్పు’ (వీరభద్రుడు) ఫేమ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అట్లీ-బన్నీ కాంబోలో రాబోతున్న ఈ ప్యాన్ ఇండియా అడ్వెంచర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.




