Ashu Reddy: అషురెడ్డి సంచలన ఆడియో లీక్..మధ్యలో వేణుస్వామిని ఇరికించారే..!

Ashu Reddy: ప్రముఖ నటి అషురెడ్డి రూ. 9.35 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నారు.

Naresh.k
Published on: 29 April 2026 9:03 AM IST
Ashu Reddy
X

Ashu Reddy

Venu Swamy: బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదాల ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. లండన్ ఎన్నారైని పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ. 9.35 కోట్లు కాజేసిందంటూ వచ్చిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. బాధితుడి తండ్రి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే, అషురెడ్డి గొంతుగా చెబుతున్న ఒక వివాదాస్పద ఆడియో రికార్డింగ్ బయటకు రావడం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చేసింది.

ఆ ఆడియోలో ఏముంది?

సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆ ఆడియోలో అషురెడ్డి.. బాధితుడు ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. నేను తీసుకున్న డబ్బులో రూ. కోటిన్నర మే నెలలో తిరిగి ఇచ్చేస్తాను. మిగిలిన మొత్తం నేను లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తాను. నటి ప్రవీణా, జ్యోతిష్యుడు వేణుస్వామి సమక్షంలో కూర్చుని సెటిల్ చేసుకుందాం అని ఆమె అన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఒకవేళ తన కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగితే రివర్స్‌లో వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించినట్లు కూడా ఆ ఆడియోలో వినిపిస్తోంది. ఈ ఆడియో బయటకు రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

అసలేం జరిగిందంటే..?

బాధితుడి కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. 2018లో అషురెడ్డికి ధర్మేంద్ర పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లడంతో, అషురెడ్డి తన అవసరాల కోసమని సుమారు రూ. 9.35 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇందులో భారీగా నగదుతో పాటు, 5 కిలోల బంగారం, ఖరీదైన విలాసవంతమైన కార్లు, ఫ్లాట్లు కూడా ఉన్నాయని సమాచారం. అయితే 2020లో పెళ్లి గురించి అడగ్గా ఆమె ముఖం చాటేసిందని, అప్పటి నుండి డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తోందని ధర్మేంద్ర తండ్రి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

అషురెడ్డి రియాక్షన్ ఏంటి?

ఈ ఆరోపణలపై అషురెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తన అనుమతి లేకుండా అసత్యాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఆడియో లీక్ కావడంతో ఆమె నిజంగానే డబ్బు తీసుకుందా? లేక ఆ ఆడియో వెనుక మరేదైనా కథ ఉందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్ నిజమైనదేనా? లేక టెక్నాలజీ సాయంతో సృష్టించారా? అనేది నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఆడియోలో ప్రస్తావించిన నటి ప్రవీణా, వేణుస్వామిలను కూడా విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే అషురెడ్డి మరిన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story