Ashu Reddy: "నువ్వు లేని లోటు తీరదు ".. అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్

Ashu Reddy: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో 'టెనెంట్' హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ మృతి చెందారు.

Naresh.k
Published on: 11 May 2026 9:47 AM IST
Ashu Reddy
X

Ashu Reddy: "నువ్వు లేని లోటు తీరదు ".. అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్

Actor Bharat Kanth: హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం ఇద్దరు యువ ప్రతిభావంతులను బలితీసుకుంది. 'టెనెంట్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న భరత్ కాంత్, యంగ్ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ పనుల నిమిత్తం వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. భరత్ కాంత్ కేవలం వెండితెరపైనే కాకుండా, పలు వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా డిజిటల్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో ఇలా జరగడం అత్యంత బాధాకరం.

అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్

భరత్ కాంత్ మరణ వార్త వినగానే బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. భరత్ అషురెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు. తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. "నీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కాకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. మనం కలిసి గడిపిన క్షణాలు, నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు భరత్.. ఎప్పటికీ నా గుండెల్లో జీవించే ఉంటావు" అంటూ అషురెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. భరత్‌తో కలిసి దిగిన పాత ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆమె తన బాధను వెలిబుచ్చారు. స్నేహితుడి అకాల మరణం అషురెడ్డిని మానసికంగా కృంగదీసింది.

భరత్ కాంత్, త్రిలోక్ మరణ వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, తోటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భరత్ కాంత్ 'టెనెంట్' చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా తన పనితనంతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న వ్యక్తి. ఒకే ప్రమాదంలో ఒక నటుడు, ఒక కెమెరామెన్ మరణించడం సినిమాటోగ్రఫీ , యాక్టింగ్ విభాగాలకు పెద్ద నష్టం.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story