Bobbili: పెద్ది మూవీ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు

Bobbili: మెగా పవర్ స్టార్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలో సాలూరు – బొబ్బిలి రైల్వే సమస్యను ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 5 Jun 2026 3:03 PM IST
Bobbili
X

Bobbili: పెద్ది మూవీ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు

Bobbili: నిన్నవిడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలో సాలూరు నుండి బొబ్బిలి జంక్షన్ వరకు రైలు సౌకర్యానికి సంబంధించిన సమస్యను ప్రస్తావించిన చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ (APSJAC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సాయి కిరణ్ యాదవ్ హృదయపూర్వక అభినందనలు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో సాలూరు నుండి బొబ్బిలి, విశాఖపట్నం ప్రాంతాలకు నడిచే బస్సు, రైలు సర్వీసులు నిలిపివేయబడ్డాయని, అనంతరం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పలు రైలు సర్వీసులను పునరుద్ధరించలేదని పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు, వినతిపత్రాలు, నిరసనలు నిర్వహించామని, అలాగే స్థానిక ప్రజా సంఘాలు కూడా ప్రజా ప్రయోజన దృష్ట్యా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు.

సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం సాలూరు నుండి విశాఖపట్నం వరకు ఒక రైలు సేవను ట్రయల్ రన్ నిర్వహించి, అదే నెలలో రెగ్యులర్ సర్వీసు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కూడా బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల ప్రజలు మరియు వివిధ ప్రజా సంఘాలు రైలు సర్వీసుల పునరుద్ధరణ కోసం పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలిసేలా ‘పెద్ది’ చిత్రంలో ప్రస్తావించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బొబ్బిలి – సాలూరు ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల తరఫున ‘పెద్ది’ చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story