AprilReleases : ఏప్రిల్ బాక్సాఫీస్ వార్.. ఏ సినిమా ఎప్పుడంటే?
AprilReleases :వచ్చే నెలలో బాక్సాఫీస్ వద్ద అసలైన సమరం మొదలుకానుంది.. రామ్ చరణ్ 'పెద్ది', శర్వానంద్ 'బైకర్', అడివి శేష్ 'డెకాయిట్' వంటి భారీ చిత్రాలతో పాటు వైవిధ్యమైన చిన్న సినిమాలు ఏప్రిల్‌లో థియేటర్లను పలకరించనున్నాయి.
AprilReleases : ఏప్రిల్ బాక్సాఫీస్ వార్.. ఏ సినిమా ఎప్పుడంటే?
AprilReleases : వచ్చే నెల (ఏప్రిల్) టాలీవుడ్‌లో బాక్సాఫీస్ సందడి గట్టిగానే ఉండబోతోంది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల నుంచి వైవిధ్యమైన కథలతో వస్తున్న చిన్న సినిమాల వరకు పక్కా ప్లానింగ్‌తో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న ఆ చిత్రాల ఏంటో, వాటి రిలీజ్ డేట్లు మొదలైన అప్డేట్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. పెద్ది (ఏప్రిల్ 30)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి క్రీడల నేపథ్యంలో కథ సాగుతుందని చెబుతున్నారు. మార్చి 27న (ఈ రోజు) రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు మొదలైన వాళ్లు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని తాజా టాక్.
2. బైకర్ (ఏప్రిల్ 3)
శర్వానంద్ హీరోగా నటించిన ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ 'బైకర్'. అభిలాష్ రెడ్డి కంకారా దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మలవిక నాయర్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3, 2026న భారీస్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్, రేసింగ్ పట్ల ఉన్న ప్యాషన్‌తో ఈ సినిమా రూపొందిందని సమాచారం. ఇందులో రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే.. 1990, 2000 రెండు వేర్వేరు కాలమానాల్లో కథ సాగుతుందని టాక్.
3. డెకాయిట్ (ఏప్రిల్ 10)
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రైమ్ డ్రామా 'డెకాయిట్'. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు ఒక నేరం కోసం మళ్లీ ఎలా కలిశారనేది ఈ సినిమా కథ అని జోరుగా ప్రచారం జరుగుతుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది.
4. స్వయంభూ (ఏప్రిల్ 10 - టెంటేటివ్)
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న భారీ పీరియాడికల్ మూవీ 'స్వయంభూ'. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్‌లో ఉండటంతో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ 'పెద్ది' వాయిదా పడితే, ఆ ప్లేస్‌లోకి ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
5. రాకాస (ఏప్రిల్ 3)
సంగీత్ శోభన్ సోలో హీరోగా వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ చిత్రం 'రాకాస'. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో ఆమె అతిథి పాత్రలో కూడా కనిపించనున్నారు. ఒక ఊరికి ఉన్న శాపం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
6. తిమ్మరాజుపల్లి టీవీ & పాపం ప్రతాప్ (ఏప్రిల్ 17)
తిమ్మరాజుపల్లి టీవీ.. కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పల్లెటూరి కథగా తెరకెక్కుతుంది. అలాగే 'పాపం ప్రతాప్'.. అనే సినిమాతో 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్ కానుంది.
అనువాద చిత్రాల సందడి ఇదే..
టాలీవుడ్ చిత్రాలతో పాటు ఇతర భాషల నుంచి కూడా ఈ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు క్రేజీ సినిమాలు వస్తున్నాయి..
కర (ఏప్రిల్ 30): ధనుష్ హీరోగా వస్తున్న రివెంజ్ డ్రామా.
L.I.K (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ): ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న వచ్చే అవకాశం ఉంది.
భూత్ బంగ్లా (ఏప్రిల్ 10): అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబోలో వస్తున్న హారర్ కామెడీ.
కేడీ: ది డెవిల్ (ఏప్రిల్ 30): కన్నడ స్టార్ ధ్రువ సర్జా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం కూడా రేసులో ఉంది.
వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్ నెల సినిమా ప్రియులకు అసలైన వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉంది. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.




