Anil Ravipudi: అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.. వెండి తెరపై సరికొత్త జోడీలు!
Anil Ravipudi: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. సంక్రాంతి సీజన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.
Anil Ravipudi: అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.. వెండి తెరపై సరికొత్త జోడీలు!
Anil Ravipudi:టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. సంక్రాంతి సీజన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో హిట్ కొట్టిన అనిల్.. 2026 'మన శంకర వర ప్రసాద్ గారు'తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో మరోసారి భారీ క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఇద్దరితో ఇప్పటికే అనిల్ సోలో సినిమాలు చేశారు. వెంకీతో అయితే ఇది ఐదవ సినిమా.
యాక్షన్ అండ్ ఎమోషన్స్ కలయికగా స్క్రిప్ట్ వర్క్:
వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా.. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తన మార్క్ వినోదంతో పాటు ఈసారి కథలో యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
వెంకటేష్-కీర్తి సురేష్:
ఈ సినిమాలో నటించబోయే కథానాయికల గురించి ఫిలిం నగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెంకటేష్‌కు జోడీగా 'మహానటి' కీర్తి సురేష్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇటీవల తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న కీర్తి.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ చెప్పిన లైన్ నచ్చడంతో ఓకే చెప్పారట. వెంకటేష్-కీర్తి సురేష్ సరికొత్త జోడీ వెండితెరపై ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కల్యాణ్ రామ్-కృతి శెట్టి:
యంగ్ బ్యూటీ కృతి శెట్టిని కల్యాణ్ రామ్ సరసన ఎంచుకున్నట్లు అనిల్ రావిపూడి టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే టాలీవుడ్‌లో కృతి శెట్టికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటి గొప్ప అవకాశమే అవుతుంది. అనిల్ సినిమా ఓకే అయితే.. బేబమ్మ ఖాతాలో హిట్ పడినట్టే. ఈ చిత్రానికి ఒక ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్, హీరోయిన్ల వివరాలపై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.




