Anchor Vishnupriya: అందం ఎరగా వేసి విష్ణుప్రియ ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?
Anchor Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలవారీగా దాదాపు రూ. 28 లక్షలకు పైగా ఆర్జిస్తుంది.
Anchor Vishnupriya: అందం ఎరగా వేసి విష్ణుప్రియ ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?
Anchor Vishnupriya Instagram : బుల్లితెర నటి, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్‌గా మారారు. ఇటీవలి కాలంలో ఆమెకు సంబంధించిన కొన్ని వివాదాస్పద వార్తలు నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో.. అటు నెగెటివిటీ పెరిగినప్పటికీ, ఇటు ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ , నెలవారీ ఆదాయం మాత్రం ఊహించని స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సంపాదనపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్న పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా ఆమెను ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 7,414 కి చేరినట్లు సమాచారం. ఈ సబ్‌స్క్రైబర్ల ద్వారా ఆమెకు ప్రతి నెలా రూ. 28 లక్షల 91 వేల వరకు భారీ ఆదాయం సమకూరుతోందని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ రేంజ్‌లో సంపాదిస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియ చేసిన బాడీ కౌంట్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతటి తీవ్ర దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ వైరల్ వివాదం వల్లే ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు రీచ్ పెరిగిందని, సబ్‌స్క్రైబర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ పెయిడ్ సబ్‌స్క్రైబర్ల కోసం ఆమె పోస్ట్ చేస్తున్న ప్రత్యేక కంటెంట్‌పై నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు, ట్రోల్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని విష్ణుప్రియ ఊరికే వదిలిపెట్టడం లేదు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, క్యారెక్టర్‌ను అప్రతిష్ట పాలు చేసేలా తప్పుడు కంటెంట్‌ను వైరల్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఆమె ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలకు దిగారు.
సైబర్ క్రైమ్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ.. తనపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ హద్దులు దాటి ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నెగెటివిటీ, భారీ ఆదాయం, లీగల్ వార్లతో ప్రస్తుతం విష్ణుప్రియ పేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మార్మోగిపోతోంది.




