Anasuya Bhardwaj: ప్రముఖ టీవీ ఛానెల్‌పై విరుచుకుపడ్డ అనసూయ.. సిగ్గులేదంటూ
Anasuya Bhardwaj: నటి అనసూయ భరద్వాజ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anasuya Bhardwaj: ప్రముఖ టీవీ ఛానెల్‌పై విరుచుకుపడ్డ అనసూయ.. సిగ్గులేదంటూ
Anasuya Bhardwaj: టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై జరుగుతున్న ఒక సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై ఆమె అత్యంత ఘాటుగా స్పందించారు. నేను డ్రింక్ చేస్తున్నాను.. దాంట్లో తప్పేముంది? ట్రోల్స్‌కు బలైన అనసూయ అంటూ ఒక ప్రముఖ టీవీ ఛానల్ తమ అధికారిక హ్యాండిల్‌లో క్లిక్ బైట్ ట్వీట్ చేయగా, దాన్ని చూసి అనసూయ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సదరు మీడియా సంస్థ వైఖరిని ఎండగడుతూ ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఐదేళ్ల క్రితం నాటి ముచ్చట.. ఇప్పుడెందుకు?
సదరు ఛానెల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అనసూయ ఫైర్ అయ్యారు. వ్యూస్ కోసం పాత విషయాలను ఎలా వాడుకుంటారో చెప్తూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. "ఇంత సిగ్గులేకుండా ఖాళీగా ఉన్నారా? అసలు మీ సమస్య ఏంటి?. 5 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో, వారు అడిగిన ప్రశ్నకు తగినట్లుగా నేను చెప్పిన సమాధానాన్ని మార్చేసి, దాన్ని ఇప్పుడు ఒక హెడ్‌లైన్‌గా మారుస్తారా?. ఆ రాబందులు రాత్రింబగళ్లు నా మీద పడి తింటూనే ఉన్నాయి కదా, ఇంకా వాళ్ల కడుపు నిండలేదా?. ఒక ప్లాట్‌ఫారమ్‌ను ఇంత అసహ్యకరంగా వాడుకుంటారా?" అంటూ మండిపడ్డారు.
నా ప్రస్తుత పోరాటాలు చూడండి
పాత విషయాలను తవ్వి తీస్తూ క్లిక్ బైట్ వార్తలు రాసే వారికి బుద్ధి చెప్తూ.. ప్రస్తుతం తాను సమాజంలో ఏ విషయాలపై స్పందిస్తున్నానో వాటిని ప్రస్తావించాలని అనసూయ కోరారు. తాను నిరంతరం మహిళల స్వయం ప్రతిపత్తి (స్వేచ్ఛ) కోసం గళం విప్పుతూనే ఉన్నానని గుర్తు చేశారు. కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా వినిపిస్తున్న స్వరాలకు మద్దతుగా నా వాయిస్‌ని అందిస్తూనే ఉన్నాను. నా గురించి ప్రస్తుతం ఉన్న తాజా వార్త అది. మనం దాని గురించి మాట్లాడుకుందాం అంటూ సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన అనసూయ
కేవలం పాత వార్తలే కాకుండా, సోషల్‌మీడియాలో తనను తీవ్రంగా వేధిస్తున్న డీప్‌ఫేక్ ఫొటోలపై కూడా అనసూయ పోరాటం మొదలుపెట్టారు. తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ ఏఐ ఫొటోలు క్రియేట్ చేసి కించపరుస్తున్నారంటూ తాజాగా ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ, హైదరాబాద్ సైబర్‌క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
So shamelessly jobless!! Inkem pani leda meeku?? 5 years back!!! 5 years back oka interview lo nannu adigina question ki unna context lo ichina answer ni twist chestu headline ga petti vaadatam???? Saripoleda na meeda nelalu nelalu vultures la tinnaru kada??? I have been… https://t.co/3ErasEEUng
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 22, 2026




