Ananya Panday: అనన్య పాండేకు చేదు అనుభవం..పబ్లిక్‌గా ప్రైవేట్ పార్ట్‌పై చేయి

Ananya Panday: ముంబై ఫ్యాషన్ షోలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు చేదు అనుభవం ఎదురైంది.

Naresh.k
Published on: 20 July 2026 11:35 AM IST
Ananya Panday
X

Ananya Panday: అనన్య పాండేకు చేదు అనుభవం..పబ్లిక్‌గా ప్రైవేట్ పార్ట్‌పై చేయి

Ananya Panday fashion show: బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ అనన్య పాండేకు ముంబై వేదికగా జరిగిన ఒక గ్రాండ్ ఫ్యాషన్ షోలో అత్యంత చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ షోలో అనన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె షోస్టాపర్‌గా వ్యవహరించి, వేదికపై అద్భుతమైన డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేస్తూ కళ్లు చెదిరే అందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అయితే షో అంతా సజావుగానే ముగిసినప్పటికీ, ఆఖర్లో జరిగిన ఒక ఊహించని సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

ఫ్యాషన్ షో విజయవంతంగా పూర్తి అయిన తర్వాత, డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి అనన్య పాండే వేదికపైకి వచ్చి మీడియా ప్రతినిధులకు ఫోటోలు ఇస్తోంది. సరిగ్గా ఆ సమయంలో గౌరవ్ గుప్తా అనన్యతో కాస్త అతిగా చనువు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఫొటోలకు ఫోజులు ఇస్తున్న క్రమంలోనే అతను ఆమె నడుముపై చేతులు వేసి గిల్లడంతో అనన్య పాండే ఒక్కసారిగా తీవ్ర అసౌకర్యానికి గురైంది.

ఆమె ముఖ కవళికల్లో, బాడీ లాంగ్వేజ్‌లోనే ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపించాయి. వందల మంది చూస్తున్న బహిరంగ వేదిక కావడం, మీడియా కెమెరాలు చుట్టూ ముట్టి ఉండటంతో అనన్య ఆ క్లిష్ట పరిస్థితిని చాలా హుందాగా హ్యాండిల్ చేసింది. ఏమాత్రం సహనం కోల్పోకుండా, పైకి నవ్వుతూనే మెల్లగా అతని పక్క నుండి చాకచక్యంగా పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత కూడా వేదికపై ఎలాంటి గొడవ చేయకుండా, ప్రొఫెషనలిజం ప్రదర్శిస్తూ గౌరవ్‌ను అభినందించి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు ,అనన్య అభిమానులు సదరు ఫ్యాషన్ డిజైనర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అని కూడా చూడకుండా, లైవ్ కెమెరాల ముందే ఇంత అనాగరికంగా ప్రవర్తించడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు.

ఈ కష్ట సమయంలో అనన్య పాండేకు మద్దతుగా క్రీడా, సినీ అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. అంత ఇబ్బందికర పరిస్థితిని కూడా ఎంతో హుందాగా ఎదుర్కొన్న అనన్య ధైర్యాన్ని మెచ్చుకుంటూనే.. డిజైనర్ గౌరవ్ గుప్తా వెంటనే ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి గ్లామర్ ఇండస్ట్రీలో మహిళా సెలబ్రిటీల వ్యక్తిగత స్పేస్ మరియు భద్రతపై సరికొత్త చర్చకు దారితీసింది. దీనిపై సదరు డిజైనర్ లేదా అనన్య పాండే టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story