Telugu Heroine: ఎంతమందికి బ్రేకప్ చెబుతావ్ తల్లి..!

Telugu Heroine: బాలీవుడ్ నటి అనన్య పాండే తన బాయ్‌ఫ్రెండ్ వాకర్ బ్లాంకోతో పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు బీ-టౌన్ వార్తలు.

Gagan kumar
Updated on: 29 Aug 2026 2:26 PM IST
Telugu Heroine
X

Telugu Heroine: ఎంతమందికి బ్రేకప్ చెబుతావ్ తల్లి..!

Telugu Heroine: బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే వ్యక్తిగత జీవితం మరోసారి బీ-టౌన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ప్రేమాయణంతో వార్తల్లో నిలిచిన ఈ భామ, తన బాయ్‌ఫ్రెండ్ వాకర్ బ్లాంకోతో విడిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు సాగిన వీరి బంధానికి పరస్పర అంగీకారంతోనే ముగింపు పలికారని తెలుస్తోంది.

2024లో జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ అట్టహాస వివాహ వేడుకల్లో అనన్య, వాకర్ బ్లాంకోల మధ్య మొదటిసారి పరిచయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా ప్రేమగా మారింది. ప్రైవేట్ ఈవెంట్లలో జంటగా మెరవడం, సోషల్ మీడియా పోస్టులు, వాకర్ పేరుతో ఉన్న ప్రత్యేక లాకెట్‌ను అనన్య ధరించడం వంటి అంశాలు వీరి రిలేషన్‌షిప్‌ను దాదాపు ఖాయం చేశాయి.

ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా పరస్పర గౌరవంతో స్నేహపూర్వకంగానే వేర్వేరు దారులను ఎంచుకున్నట్లు సమాచారం. గతంలో ఈ భామ ఆదిత్య రాయ్ కపూర్‌తోనూ డేటింగ్ చేసి విడిపోయిన సంగతి విదితమే. క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో కూడా అనన్య పాండే డేటింగ్ చేసినట్టు వార్తలొచ్చాయి.

2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఎంట్రీ ఇచ్చి ఫిల్మ్‌ఫేర్ అందుకున్న అనన్య, ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’తో మంచి విజయాన్ని చూసింది. అయితే, విజయ్ దేవరకొండ సరసన నటించిన పాన్-ఇండియా చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది.

ఈ వైఫల్యం తర్వాత తన కెరీర్ పంథాను మార్చుకున్న అనన్య, ఓటీటీ కంటెంట్‌పై దృష్టి పెట్టారు. ‘గెహ్రాయియాన్’, ‘ఖో గయే హమ్ కహా’ చిత్రాల్లో పరిణతి చెందిన నటనతో ఆకట్టుకుంది. థియేటర్లలో ‘డ్రీమ్ గర్ల్ 2’తో కమర్షియల్ హిట్ సాధించడమే కాక, సైబర్ థ్రిల్లర్ ‘CTRL’, అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘కాల్ మీ బే’లతో ఓటీటీ స్పేస్‌లో ప్రత్యేక ముద్ర వేసింది.

వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా, అనన్య తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెడుతోంది. ఇటీవల కోర్ట్‌రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’లో లాయర్‌గా, మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’తో అలరించిన ఈ భామ, ఫోర్బ్స్ ఆసియా ‘30 అండర్ 30’ జాబితాలోనూ చోటు సంపాదించింది. అంతేకాక, సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా ‘సో పాజిటివ్’ అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ‘కాల్ మీ బే 2’తో పాటు కార్తీక్ ఆర్యన్‌తో చేయబోయే ప్రాజెక్టులపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి, అనన్య కెరీర్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story