Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. వర్చువల్ పిటిషన్ రిజెక్ట్, నేరుగా కోర్టుకు!
Allu Arjun: థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. వర్చువల్ పిటిషన్ రిజెక్ట్, నేరుగా కోర్టుకు!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో జరిగిన ఓ థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు రానుండటం గమనార్హం.
ఈ కేసు విచారణకు సంబంధించి మూడు రోజుల క్రితమే అల్లు అర్జున్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌ల బిజీ షెడ్యూల్‌లో ఉన్న కారణంగా.. కోర్టుకు నేరుగా రాలేకపోతున్నానని, వర్చువల్ (ఆన్‌లైన్) ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
కానీ, ఈ విజ్ఞప్తిని నాంపల్లి న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కచ్చితంగా వ్యక్తిగతంగానే కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అల్లు అర్జున్ తన షూటింగ్‌కు విరామం ఇచ్చి, నేరుగా నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన న్యాయమూర్తి ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.




