Happy Movie: ‘పెద్ది’ కంటే ‘హ్యాపీ’ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయ్

Happy Movie: కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘హ్యాపీ’ 4K రీ-రిలీజ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Naresh.k
Updated on: 14 Jun 2026 9:32 AM IST
Happy Movie
X

Happy Movie: ‘పెద్ది’ కంటే ‘హ్యాపీ’ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయ్

Happy Re-Release : తెలుగు హీరోలకు పక్క రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉండటం కామన్. కానీ, ఒక పక్క రాష్ట్రం మొత్తం మన హీరోని తమ సొంత హీరోలా ఓన్ చేసుకోవడం ఒక్క అల్లు అర్జున్ విషయంలోనే సాధ్యమైంది. అందుకే ఆయన్ని అక్కడి వాళ్లంతా ప్రేమగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మలయాళ టెలివిజన్ స్క్రీన్లపై డబ్బింగ్ సినిమాలతో మొదలైన ఈ బంధం, నేడు పాన్ ఇండియా స్థాయికి చేరినా ఏమాత్రం తగ్గలేదు సరే కదా.. మరింత స్ట్రాంగ్ అయింది. తాజాగా కేరళలో రీ-రిలీజ్ అయిన బన్నీ పాత చిత్రం సృష్టిస్తున్న సంచలనాలే ఇందుకు నిదర్శనం.

దర్శకుడు ఎ. కరుణాకరన్ కాంబినేషన్‌లో 2006లో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ ‘హ్యాపీ’. అప్పట్లో మలయాళంలో ‘హ్యాపీ బీ హ్యాపీ’ పేరుతో డబ్ అయి అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది. అయితే, రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాను సరికొత్తగా 4K వెర్షన్‌లో కేరళలో రీ-రిలీజ్ చేశారు. ఇంకేముంది.. థియేటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. షోలన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. థియేటర్లలో బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులకు కేరళ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ, వేస్తున్న డ్యాన్సుల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ రీ-రిలీజ్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'హ్యాపీ' చిత్రం కేరళలో మొదటి రోజే ఏకంగా రూ. 30 లక్షల కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ప్రస్తుతం ఉన్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల ఓపెనింగ్స్ కంటే ఈ 20 ఏళ్ల నాటి సినిమా వసూళ్లే ఎక్కువ కావడం ఇక్కడ అసలైన విశేషం.

ఇటీవల మలయాళంలో విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా తొలిరోజు రూ. 20 లక్షలు, సంక్రాంతి బరిలో వచ్చిన ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ ఫస్ట్ డే రూ. 19 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే, ఇద్దరు స్టార్ హీరోల సరికొత్త భారీ చిత్రాల ఓపెనింగ్స్ కంటే అల్లు అర్జున్ పాత రీ-రిలీజ్ సినిమానే పైచేయి సాధించింది.

గతంలో రీ-రిలీజ్ అయిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ కేరళలో రూ. 26.5 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ‘హ్యాపీ’ సినిమా రూ. 30 లక్షలతో ఆ రికార్డును సైతం అధిగమించి, కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రెండో రీ-రిలీజ్ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది.

చాలామంది ‘పుష్ప’ సినిమాతోనే అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా క్రేజ్ వచ్చిందని అనుకుంటారు. కానీ కేరళలో మాత్రం 'ఆర్య', 'హ్యాపీ', 'బన్నీ', 'దేశముదురు' చిత్రాలతోనే ఆయన బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అక్కడ బన్నీ సినిమా వస్తుందంటే చాలు, స్థానిక మాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉందంటే కేరళ బాక్సాఫీస్ పై అల్లు అర్జున్ ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 'హ్యాపీ' రీ-రిలీజ్ సంచలనం కేవలం ఒక సినిమా సక్సెస్ మాత్రమే కాదు.. అది మాలీవుడ్ లో అల్లు అర్జున్ కు ఉన్న అజేయమైన స్టార్‌డమ్‌కు తిరుగులేని సాక్ష్యం.









Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story