Ntr: ఎన్టీఆర్ సినిమాలో స్టార్ హీరోయిన్..ఆ సినిమాలో వదినగా!

Ntr: ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో 'డ్రాగన్' సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Gagan kumar
Published on: 4 Sept 2026 10:56 AM IST
Ntr
X

Ntr: ఎన్టీఆర్ సినిమాలో స్టార్ హీరోయిన్..ఆ సినిమాలో వదినగా!

Ntr: 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఈ భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఫిలిం నగర్ నుంచి వచ్చిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు విలక్షణ నటుడు షాహిద్ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

గతంలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'RRR' చిత్రంలో ఆలియా భట్ నటించినప్పటికీ, ఎన్టీఆర్‌తో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ 'డ్రాగన్' వార్త నిజమైతే, వీరిద్దరి కాంబినేషన్‌లో పూర్తి నిడివి సీన్స్ చూసే అవకాశం లభిస్తుందని నందమూరి అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఆలియా, షాహిద్ పేర్లు కూడా తోడవ్వడంతో ఈ సినిమా పాన్-ఇండియా రేంజ్ మరో స్థాయికి చేరింది.

50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి నటీనటులకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ను ఎలాంటి రగ్గడ్ మరియు పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారో అని సినీ ప్రేమికులు ఈ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story